Wife: ఇద్దరికి రెండో పెళ్లి, రెండో భార్య దెబ్బతో ఇంట్లో అడుగు పెట్టాలంటే హడలిపోయిన భర్త, చివరికి !
బెంగళూరు: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేసి ఆమెతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. అంతే పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇక మరో యువతి వివాహం చేసుకుని ఆమె భర్తతో కలిసి కాపురం పెట్టింది. భార్య దెబ్బ తట్టుకోలేక ఆమె భర్త జెండా ఎత్తేశాడు. భర్త దూరం అయిన మహిళ, భార్య దూరం అయిన యువకుడు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి రెండో పెళ్లి కావడంతో ఇకనైనా కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలు బుద్దిమాటలు చెప్పారు. రెండో భార్యతో అయినా సక్రమంగా కాపురం చేద్దామని అనుకున్న భర్తకు నాలుగు నెలల్లోనే సినిమా కనపడింది. తనకు కనీసం కేజీ బంగారు నగలు కావాలని, ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ డ్రస్ లు కావాలని, డబుల్ బెడ్ రూమ్ హౌస్ కావాలని ఇలా రకరకాలుగా రెండో భార్య గొంతెమ్మ కోరికలు కోరడం మొదలు పెట్టింది. రెండో భార్య దెబ్బకు అతను ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలంటేనే భయపడిపోయాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇదే నా బతుకు అని ఆవేదన చెందిన రెండో భర్త ఓ లెటర్ రాసి పెట్టి అతను తీసుకున్న నిర్ణయానికి అందరూ హడలిపోయారు. రెండో భార్య దెబ్బతో ఆమె రెండో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఏదేదో ఊహించుకున్నాడు
బెంగళూరులోని బసవేశ్వరనగర్ లోని మంజునాథ నగర్ లో చాంద్ పాషా అలియాస్ చాంద్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న చాంద్ పాషా అతని భార్యతో సంతోషంగా కాపురం చేసి ఆమెతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు.

భార్యకు విడాకులు ఇచ్చేశాడు
చాంద్ పాషా దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. అంతే పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే చాంద్ పాషా దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో దంపతులు విడాకులు తీసుకున్నారు. భార్యకు విడాకులు ఇచ్చేసిన చాంద్ పాషా మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

భర్తను వదిలేసిందని రెండో పెళ్లి చేసుకున్నాడు
బెంగళూరు నగరంలోని ఉస్నా అనే యువతి నివాసం ఉంటున్నది. వివాహం చేసుకుని ఉస్నా ఆమె భర్తతో కలిసి కాపురం పెట్టింది. భార్య ఉస్నా దెబ్బ తట్టుకోలేక ఆమె భర్త జెండా ఎత్తేశాడు. భర్త దూరం అయిన ఉస్నాకు, భార్య దూరం అయిన చాంద్ పాషా నాలుగు నెలల క్రితం బెంగళూరులో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

మెకానిక్ భార్యకు గొంతెమ్మ కోరికలు
ఇద్దరికి రెండో పెళ్లి కావడంతో ఇకనైనా కలిసి సంతోషంగా ఉండాలని చాంద్ పాషా, ఉస్నా దంపతులకు వాళ్ల పెద్దలు బుద్దిమాటలు చెప్పారు. తన భర్త చాంద్ పాషా మెకానిక్ పని చేస్తున్నాడు అనే విషయం మరిచిపోయిన ఉస్నా అతని స్థాయికి మంచిన కోరికలు కోరడం మొదలుపెట్టింది.

జస్ట్ కేజీ నగలు, ఖరీదైన బట్టలు, డబుల్ బెడ్ రూమ్ హౌస్
రెండో భార్య ఉస్నాతో అయినా సక్రమంగా కాపురం చేద్దామని అనుకున్న ఆమె రెండో భర్త చాంద్ పాషాకు పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే సినిమా కనపడింది. తనకు కనీసం కేజీ బంగారు నగలు కావాలని, ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ డ్రస్ లు కావాలని, డబుల్ బెడ్ రూమ్ హౌస్ కావాలని ఇలా రకరకాలుగా రెండో భార్య ఉస్నా గొంతెమ్మ కోరికలు కోరడం మొదలు పెట్టడంతో చాంద్ పాషా హడలిపోయాడు.
Recommended Video

ఆత్మహత్య చేసుకున్న భర్త
రెండో భార్య ఉస్నా దెబ్బకు ఆమె రెండో భర్త చాంద్ పాషా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలంటేనే భయపడిపోయాడు. ఇటీవల కొంతకాలంగా ఎక్కువ సేపు మెకానిక్ సెడ్ లోనే చాంద్ పాషా కాలం గడిపాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నా నా బతుకు ఇంతే అని ఆవేదన చెందిన రెండో భర్త చాంద్ పాషా ఓ లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications