గుడ్ న్యూస్: ఇక చిన్నారులకు కూడా.. వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్..

కరోనా సమూల నిర్మూలనకు వ్యాక్సిన్ కంపల్సరీ. ఇప్పుడు చిన్నారులకు కూడా టీకా ఇస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇదీ గుడ్ న్యూస్. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికే అందించిన వ్యాక్సిన్లు.. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది.

త్వరలో చిన్న పిల్లలకు కూడా అందించేందుకు కొవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2,3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని.. డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచుతామని తెలిపారు.

ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 will give vaccine children also: bharat biotech

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+