కర్ణాటక సీఎం ఏ కులం లీడర్ అంటే ?, దమ్ముంటే చెప్పండి అంటూ సవాల్, సీఎం క్లారిటీ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ అయిన బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది, బీజేపీకి ఇంతకాలం రైట్ హ్యాండ్ గా ఉన్న లింగాయత్ కులం నాయకులు ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోవడం, లింగాయత్ కులానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆ కుల సంఘం నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
దమ్ముంటే లింగాయత్ కులానికి చెందిన వారిని సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదేదో మీరేచెబితే బాగుంటుంది కదా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు లింగాయత్ కులానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని ఏ పార్టీ కూడా బహిరంగంగా చెప్పడానికి సాహసం చెయ్యడంలేదు.
గురువారం కర్ణాటక మాజీ సీఎం, లింగాయత్ కులంలో చాలా పవర్ ఫుల్ నాయకుడు అయిన బీఎస్. యడియూరప్ప అధ్యక్షతన లింగాయత్ కులానికి చెందిన నాయకులు సమావేశం అయ్యారు. లింగాయత్ నాయకులతో చర్చించి ఆ కులం ఓట్లు చీలిపోకుండా చూసుకునే బాధ్యతను బీజేపీ హైకమాండ్ మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు అప్పగించారు.

అయితే ఇప్పటికే బీజేపీలోని చాలా మంది లింగాయత్ కులానికి చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పేయడంతో ఇంతకాలం బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ కులంలో చీలికలు మొదలైనాయి, గురువారం మీడియాతో మాట్లాడిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక సీఎంగా లింగాయత్ కులానికి చెందిన వ్యక్తిని నియమించే విషయంలో బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
గతంలో 1967 నుంచి ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క లింగాయత్ నాయకుడిని సీఎం చెయ్యకుండా ఆ కులం ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని, గతంలో వీరేంద్ర పాటిల్, రాజశేఖర్ ను సీఎం చేసినట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ వారిని పదవి నుంచి తప్పించి కుళ్లు రాజకీయాలు చేసిందని, లింగాయత్ ను ఓటర్లుగా మాత్రమే చూసిన కాంగ్రెస్ ఆ కులం ప్రజలను మోసం చేసిందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
అయితే మాజీ సీఎం బీఎస్, యడియూరప్పతో భేటీ అయిన లింగాయత్ కులం నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అని బీజేపీ నాయకులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు కర్ణాటక సీఎంగా లింగాయత్ నాయకుడిని ఏ పార్టీ ప్రకటిస్తుంది ?, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అని టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications