TVK చీఫ్ విజయ్ సంచలనం..ఎమ్మెల్యే పదవికి రాజీనామా? రేసులో ముందున్న త్రిష ?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 108 సీట్లతో ఘన విజయం సాధించి సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత విజయ్ (Vijay) ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే తాను పోటీ చేసిన రెండు సీట్లు తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ లో ఒకదాన్ని ఉంచుకుని, మరో సీటును వదులుకోవడం. అయితే ఇది అంత సులువు కాదు. ఎందుకంటే విజయ్ ను నమ్మి ఓట్లు వేసిన ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు.. ఇప్పుడు ఆయన వదులుకుంటే తిరిగి ఇతరుల్ని గెలిపించాలంటే చాలా ఆలోచించాలి. అదే ఇప్పుడు విజయ్ కు సవాల్ గా మారింది.
ఈ నేపథ్యంలో తాను పోటీ చేసిన రెండు సీట్లలో తిరుచ్చి ఈస్ట్ సీటును వదులుకునేందుకు విజయ్ సిద్దమవుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తిరుచ్చితో పోలిస్తే పెరంబూర్ లో ఉన్న అనుకూల పరిస్ధితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో త్వరలో దీనిపై విజయ్ స్వయంగా ప్రకటన చేసే అవకాశం. అయితే ఇలా ఓ సీటు వదులుకోవడం ఒక్కటే కాదు, అందులో ఎవరిని నిలబెట్టి గెలిపించాలనేది కూడా విజయ్ కు కీలకమే.

దీంతో తన సన్నిహితురాలు, హీరోయిన్ త్రిషతో పాటు పలువురి పేర్లను తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల రేసులో పరిశీలించే అవకాశం ఉంది. విజయ్ కు మద్దతుగా ఇప్పటికే బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ, సన్నిహితంగా మెలుగుతున్న త్రిషను తిరుచ్చి ఈస్ట్ నుంచి నిలబెడితే గెలిపించుకోవడం సులువవుతుందని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ డీఎంకే గట్టి అభ్యర్దిని నిలబెడితే మాత్రం విజయ్ ఆలోచన మారే అవకాశాలూ లేకపోలేదు. దీంతో తిరుచ్చి సీటు వదులుకోవడం, అక్కడ అభ్యర్ధి వంటి అంశాలపై విజయ్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.














Click it and Unblock the Notifications