వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Winter Season Problems: చలికాలంలో ఈ పనులు చేయండి చాలు.. ఆరోగ్యం మీ వెంటే..

|
Google Oneindia TeluguNews

చలి కాలం రాగానే.. చాలా మందికి జలుబు, దగ్గుతో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అయితే ఇవన్ని రాకుండా ఉండాలంటే మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఆ రోగనిరోధక శక్తి మనం తినే ఆహారం నుంచి వస్తుంది. అందుకే బలమైన ఆహారం తీసుకువాలి. ఈ కాలంలో ప్రతి ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలి. వేడి వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చెవిలో దూదులు పెట్టుకొని బయటికి వెళ్లాలి. చిన్నపిల్లలకు స్వెటర్లు వేసి బయటకు పంపించాలి.

మిటమిన్ సి

మిటమిన్ సి

అలాగే మిటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మీ ఆహారంలో ద్రాక్ష, నిమ్మకాయలు తీసుకుంటే మంచిది. పసుపు ఒక్క రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

కర్కుమిన్

కర్కుమిన్


పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందట. అందుకే మీ వంటల్లోనే కాకుండా.. మీరు ప్రతిరోజూ తాగే పాలలో చిటికెడు పసుపును వేసుకుని తాగితే మంచిదట. చలికాలం చల్లటి పదార్థాలు, తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. పెరుగు కూడా ఎక్కువగా తినొద్దు. వేడి నీటిని తాగడం మంచిది.

విటమిన్ ఎ

విటమిన్ ఎ


జామపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి. విటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అల్లం టీ తాగడం, ఆహారంలో అల్లం వేసుకుంటే మంచిది.

English summary
By taking various precautions during winters, diseases can be prevented. It is especially good if you take substances that boost immunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X