కేరళ కామాంధులు: ఆ కోరిక తీర్చుకునేందుకు సొంత భార్యలనే మార్చుకున్న వెధవలు
కేరళ: ఈ మధ్యకాలంలో కేరళ రాష్ట్రం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఓ వైపు రాజకీయ వేడి ఠారెత్తుతుండగా మరోవైపు క్రైమ్ కేసులు కూడా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా కేరళలో నమోదైన ఓ కేసు ప్రధానాంశాల్లో నిలిచింది. ఇంతకీ ఆ కేసు ఏమిటి...? ఎందుకు చర్చనీయాంశమైంది..?
పైశాచికత్వం ప్రదర్శించిన భర్త
భార్యాభర్తల మధ్య గుట్టుగా ఉండాల్సిన కాపురం భర్త పైశాచికత్వంతో రచ్చగా మారింది. భర్త రాక్షసత్వాన్ని భరించిన ఆ భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అలపుజా జిల్లాలోని కాయంకుళంలో చోటుచేసుకుంది. కాయంకుళంలో ఓ జంట కాపురం చేస్తోంది. భర్త తన అవసరాల కోసం తన భార్యను పరాయి పురుషులతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తీసుకువచ్చే వాడు. అయితే భర్త వేధింపులు భరించలేక ఆ భార్య పలువురు మగవారితో శృంగారంలో పాల్గొనింది.
పరాయి మగాళ్లతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి
భర్త అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నా... పాపం ఆ మహిళ భరిస్తూ వచ్చింది. ఒకరోజు కాలికట్కు చెందిన అర్షద్ అనే వ్యక్తితో శృంగారంలో పాల్గొనాల్సిందిగా భర్త ఆదేశించాడు. అయితే ఇందుకు ఒప్పుకోలేదు భార్య. అర్షద్‌తో శృంగారంలో పాల్గొనాలని విపరీతమైన ఒత్తిడి తీసుకురావడంతో ఇక భరించలేక పోలీసులను ఆశ్రయించింది. అర్షద్ అనే వ్యక్తి కాలికట్కు చెందినవాడని అతను బాధిత మహిళ భర్తకు సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ద్వారా పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాల యాప్ షేర్‌చాట్ ద్వారా డీల్
సాధారణంగా వాట్సాప్, మెసెంజర్లాంటి సోషల్ మీడియాల యాప్‌ల ద్వారా చాట్ చేస్తే ఎవరితో చాట్ చేస్తున్నావో తెలిసిపోతుంది. అయితే షేర్‌చాట్‌లో వ్యక్తిగత విషయాలు ఏమీ కనిపించవని పోలీసులు తెలిపారు. ఇలా అర్షద్‌తో షేర్‌చాట్ యాప్ ద్వారా మాట్లాడిన బాధిత మహిళ భర్త అతనితో ఒక ఒప్పందానికి వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో కలవాలో ఆ తేదీ, స్థలం, సమయం డిసైడ్ చేశారు.
భార్యలను మార్చుకుని శృంగారంలో పాల్గొన్నారు: పోలీసులు
అర్షద్ అనే ఒక్క వ్యక్తితోనే కాదని ...ఇంకా చాలామంది వ్యక్తులతో తనను లైంగికంగా కలవాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చి వారితో పంపాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహిళ భర్తతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారికింద పలు సెక్షన్లు నమోదు చేశారు. కృష్ణాపురంకు చెందిన కిరణ్, వవక్కవుకు చెందిన సీది, కేరళపురంకు చెందిన ఉమేష్, తిరువళ్లకు చెందిన బ్లెసరిన్ పయిప్పాడ్లుగా గుర్తించారు. అయితే ఈ నలుగురు తమ భార్యలను ఒకరితో ఒకరు మార్చుకుని శృంగారంలో పాల్గొనేవారని పోలీసులు తెలిపారు.