పెళ్లికి నిరాకరించడంతో కాల్చేసిన ప్రియుడు: ‘లాకెట్’ కాపాడింది!

గుర్గావ్: సినిమాల్లో మాత్రమే చూసే ఓ ఘటన గుర్గావ్‌లో చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని తన మాజీ ప్రియుడు తుపాకీతో కాల్చేశాడు. అయితే, ఆ తుపాకీలోంచి వచ్చిన బుల్లెట్ ఆమె మెడలోని ఓ లాకెట్‌కు తగిలి పక్కకుపోయింది. దీంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది.

గుర్గావ్ సెక్టార్ 55 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బాధిత యువతి(27) ఓ స్టోర్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా, కోల్‌కతాకు చెందిన 32ఏళ్ల అశోక్ కుమార్ అనే వ్యక్తి.. ఆమెతో గత కొంతకాలంగా ఆమెతో ప్రేమాయణం సాగించాడు. అయితే, వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు.

గత జులై నెల నుంచి వీరిద్దరూ కలుసుకోవడం లేదు. అయితే, అశోక్ కుమార్ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంటపడటం మానలేదు. ఇందుకు ఆమె పలుమార్లు తిరస్కరించింది. దీంతో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కుమార్.

Woman escapes murder attempt by ex-boyfriend as locket blocks bullet

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం సెక్టార్ 55 ప్రాంతంలో తనను కలవాలని ఆమెకు చెప్పాడు కుమార్. అక్కడికి సమీపంలోనే ఆమె ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది సదరు యువతి. కాగా, రాత్రి 8గంటల ప్రాంతంలో ఆమె తన నివాసానికి చేరుకుంటున్న సమయంలో అడ్డగించిన కుమార్.. తను తీసుకొచ్చిన నాటు తుపాకీతో ఆమెను కాల్చేశాడు.

ఆ తర్వాత అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాను పారిపోవడం లేదని, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారని కుమార్ పోలీసులకు తెలిపాడు.

కాగా, తుపాకీ బుల్లెట్ సదరు యువతి వేసుకున్న లాకెట్‌కు తగిలి పక్కకు పోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కుమార్ సెల్ ఫోన్‌లో మరో అమ్మాయిన నెంబర్ ఉండటం గమనించిన సదరు యువతి అతనితో బ్రేకప్ చేసుకుందని, ఈ నేపథ్యంలోనే కుమార్ ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+