ఇష్టపడి ఒకరితో శృంగారం, రెండో వ్యక్తి రేప్ ప్రయత్నం: నగ్నంగా మూడో అంతస్తు నుంచి దూకిన యువతి

జైపుర్‌: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. జైపూర్‌లోని ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నగ్నంగా భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. కామాంధుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె అంత పైనుంచి దూకింది.

ఇద్దరు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, పదేపదే వేధిస్తున్నారు. అంతేకాదు చిత్రహింసలు పెట్టారు. వీటిని భరించలేక ఆమె మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.

Woman Jumps Naked From Third Floor Of Building After Being Gang raped, Tortured in Jaipur

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు 23 ఏళ్ల నేపాలీ మహిళను శుక్రవారం నుంచి బంధించారు. పదేపదే ఆమెను బలవంతం చేశారు. పైగా చిత్రహింసలు పెడుతుండటంతో ప్రాణభయంతో నగ్నంగానే మూడో అంతస్తు నుంచి దూకేసింది.

ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు. నిందితులను 19 ఏళ్ల లోకేష్ సైనీ, 24 ఏళ్ల కమల్ సైనీగా గుర్తించారు.

మరో ట్విస్ట్, అసలు విషయం ఇదీ

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు. అపార్టుమెంటులో ఉన్న ఒకరు తమకు ఫోన్ చేసి విషయం చెప్పారని, తాము వెంటనే సంఘటన స్థలానికి వెళ్లామని అన్నారు. ఆమె రాత్రి సమయంలో ఇద్దరు పురుషులతో కలిసి తన ప్లాట్‌కు వచ్చిందని, తెల్లవారుజామున అందులో నుంచి అరుపులు వినిపించాయని కొందరు చెప్పారని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక దర్యాఫ్తు ప్రకారం ఆమె తనతో వచ్చిన ఇద్దరిలో ఒకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నదని, ఆ తర్వాత మరో వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయబోయాడని, ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరు కలిసి ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, దీంతో ఆమె బాల్కనీ నుంచి కిందకు దూకేసిందని తెలిపారు. ఆ మహిళ నేపాల్‌కు చెందిన వ్యక్తి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+