దారుణం: లెక్చరర్‌పై లైంగిక వేధింపులు,ప్యాంట్ విప్పి వికృతంగా...

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకొంది. ఓ మహిళా లెక్చరర్‌ను ఆమె పనిచేస్తున్న చోటే లైంగిక వేధింపులకు గురైంది. బాధితురాలు తోటి ఉద్యోగుల సహయంతో ఈ ఘటన నుండి తప్పించుకొంది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది.

భార్య సహయంతో కోడలిపై అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన కోడలు, డిఎన్ఏ పరీక్షతో ఇలా..

ఢిల్లీలోని కొన్నౌట్ ప్రాంతంలో మహిళా లెక్చరర్‌పై లైంగిక వేధింపులు చోటు చేసుకొన్నాయి. అయితే ఫోన్ మాట్లాడేందుకు తాను పనిచేసే ప్రాంతంలో టెర్రస్‌పైకి వచ్చిన ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

దారుణం: రెండున్నర ఏళ్ళుగా ఉద్యోగినిపై నలుగురు రేప్, వీడియో తీసి ఇలా...

అయితే ఈ ఘటనతో బాధితురాలు భయపడింది. అయితే ఆమె నోరు గట్టిగా నొక్కి ఆమెను అసభ్యంగా నిందితుడు తాకాడు. అంతేకాదు ఆమె సెల్‌ఫొన్‌ను కూడ లాక్కొన్నాడు.

మహిళా లెక్చరర్‌పై లైంగిక వేధింపులు

మహిళా లెక్చరర్‌పై లైంగిక వేధింపులు

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకొంది. ఓ మహిళా లెక్చరర్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఆమె పని చేసే కళాశాల పరిసరాల్లోనే వేధింపులకు పాల్పడ్డాడు. కొన్నౌట్‌ ప్రాంతంలోని లంచ్‌ సమయం కావటంతో తన కళాశాల మేడ మీద ఫోన్‌ మాట్లాడేందుకు బాధిత లెక్చరర్ వెళ్ళాడరు. ఆమె ఫోన్ మాట్లాడుతుండగానే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకొనేందుకు ప్రయత్నించాడు.

అసభ్యంగా తాకుతూ

అసభ్యంగా తాకుతూ

నిందితుడి నుండి తప్పించుకొనేందుకు బాధితురాలు మేడపై అటూ ఇటూ పరుగెత్తింది. కానీ, సాధ్యం కాలేదు.టెర్రస్ తలుపు బిగించాడు నిందితుడు.అంతేకాదు నిందితుడి నుండి తప్పించుకొనేందుకు బాధితురాలు మేడ మీద నుండి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. కానీ, నిందితుడు ఆమెను ఆ సమయంలో గట్టిగా పట్టుకొని ఆమెను అసభ్యంగా తాకాడు.

నోరు నొక్కి శరీరంపై ఇలా

నోరు నొక్కి శరీరంపై ఇలా

నిందితుడు బాధితురాలిని నోరు నొక్కి ఆమె శరీరంపై అసభ్యంగా తాకాడు. తన ప్యాంట్ విప్పి అసభ్యంగా వ్యవహరించాడు. వికృతంగా వ్యవహరించాడు. బాధితురాలు నిందితుడితో పెనుగులాడి తప్పించుకొంది. గట్టిగా అరిచింది. దీంతో బాధితురాలి పోన్‌ తీసుకొని నిందితుడి పక్క మేడపైకి దూకి పారిపోయాడు.

తోటి ఉద్యోగుల సహయంతో

తోటి ఉద్యోగుల సహయంతో

టెర్రస్ మీద ఉన్న బాధితురాలు తోటి ఉద్యోగుల సహయంతో కిందకు వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ ఘటన సమయంలో సీసీ టీవి ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 32-year-old woman was molested in the Delhi's central Connaught Place area while she took a break from work to speak on the phone, police said on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి