కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్

ఆస్తి గొడవల పరిష్కారం కోసం ఓ మహిళకు ఎదురైన దారుణ అనుభవం కలచివేస్తోంది. తన సోదరుడితో ఉన్న ఆస్తి వివాదం విషయంలో న్యాయం పొందాలని భావించిన బాధితురాలు, అడ్వకేట్ జలాలుద్దీన్‌ను ఆశ్రయించింది. కేసు విన్న జలాలుద్దీన్, కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె కొంత ధైర్యం తెచ్చుకుంది. అయితే, ఈ హామీ వెనుక దాగున్న కుట్రను ఆమె ఊహించలేకపోయింది.

న్యాయవాది అప్పటి నుంచి తన ఇంటికి తరచుగా రావడం మొదలుపెట్టాడని, ఒక రోజు ఆరోగ్యం బాలేనప్పుడు బలవంతంగా బయటకు తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. నమ్మకంతో అతడి వెంట వెళ్లగా, ఆగ్రాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి, తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం చేశాడని ఆమె సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని, తనకు పెద్ద పెద్ద పలుకుబడి ఉందని బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది.

Woman raped in agra Congress party office

ఆ దారుణం అక్కడితో ఆగలేదని, 2019 నుంచి ఇప్పటి వరకు జలాలుద్దీన్ తన ఇంటికి వస్తూ, పోతూ ఐదేళ్లుగా టార్చర్ చేస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అతని భయంతో ఇంటికి తాళం వేసుకుని లోపలే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయింది. అంతేకాకుండా, ఇంట్లో తిని, తాగి, పడుకోవడమే కాకుండా, తమ ఇంట్లోనే నమాజ్ చేస్తూ, తమతో బలవంతంగా చేయించాడని, ఉపవాసం కూడా చేయాలని బెదిరించాడని ఆమె చెప్పుకొచ్చింది. తమకు న్యాయం చేయాలని, ఆ నరకం నుంచి విముక్తి కల్పించాలని ఆమె వేడుకుంటోంది. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+