Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైన్ స్నాచర్‌ను లాగిపడేసిన మహిళ: చితక్కొట్టారు, ‘బ్రేవో’ అంటూ నెటిజన్లు(వీడియో)

Recommended Video

    చైన్ స్నాచర్‌ను లాగిపడేసిన మహిళ: చితక్కొట్టారు (వీడియో)

    న్యూఢిల్లీ: దేశంలోని నగరాల్లో ఇటీవలి కాలంలో తరచూ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, దేశ రాజధాని నగరంలో ఓ చైన్ స్నాచర్ ఓ మహిళ మెండలోంచి బంగారు గొలుసును తెంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆమె అతడ్ని గట్టిపట్టుకుని కిందపడేసింది. అక్కడేవున్న జనాలు అతడ్ని పట్టుకుని చితకబాదారు.

    ఆగస్టు 30న జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని నగ్లోయి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ టీవీలో రికార్డైన వీడియో ప్రకారం.. మరో బాలికతో కలిసి రిక్షాలో ప్రయాణిస్తున్న సదరు మహిళ.. నగ్లోయి వీధిలో దిగింది. ఆ తర్వాత గమ్యస్థానం వైపు వెళుతుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ గొలుసు దొంగ ఆమె మెడలోంచి బంగారు గొలుసు లాగేశాడు.

    Woman thrashes chain snatcher on Delhi street in viral CCTV video. Bravo, says Internet

    అయితే, వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ.. చైన్ స్నాచర్‌ను పట్టుకుని బైక్‌పై నుంచి లాగేసి కిందపడేసింది. దీంతో అక్కడున్న వారంతా కలిసి ఆ దొంగను చితకబాదారు. ఆమె కూడా చెడామడా వాయించింది.

    ఆ తర్వాత తన గొలుసు తీసుకున్న సదరు మహిళ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా శక్తిని చూపావ్.. ధైర్యవంతురాలైన మహిళ అంటూ ఆమెను కొనియాడుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+