ఏసీబీ ఆఫీసర్‌నని ఫోజు.. మహిళ చేతిలో చెప్పు దెబ్బలుతిన్న కేటుగాడు!(వీడియో)

జంషెడ్‌పూర్ : జార్ఖండ్‌లో ఓ మహిళ ఉగ్రకాళి అవతారం ఎత్తింది. నకిలీ ఏసీబీ అధికారిగా చెలామణి అవుతున్న కేటుగాడికి పట్టపగలే చుక్కలు చూపించింది. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిన సదరు వ్యక్తిని పరిగెత్తించి మరీ కొట్టింది. చెప్పుతో చెడామడా చితకబాదింది. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జంషెడ్‌పూర్ మ్యాంగో ప్రాంతానికి చెందిన మహిళను ఓ వ్యక్తి ఏసీబీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పరిష్కారం చూపుతానని అన్నాడు. సదరు మహిళ అతని మాటలు నమ్మకపోవడంతో ఏసీబీ అధికారినంటూ ఫేక్ ఐడీ చూపించాడు. రూ. 50వేలు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పాడు.

woman thrashes impostor who tried to steal Rs 50,000

అతని వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన మహిళ.. డబ్బులిస్తానంటూ అతన్ని మ్యాంగో ప్రాంతానికి పిలిచింది. నమ్మి వచ్చిన ఆ కేటుగాన్ని పట్టుకుని చెప్పుతో చితక్కొట్టింది. ఆ దెబ్బలకు తాళలేక వాడు స్వయంగా వెళ్లి పోలీసు జీపు ఎక్కి కూర్చోవడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+