బలవంతంగా ఫోన్ నెంబర్, వాట్సాప్‌తో మహిళ ఫిర్యాదు
న్యూఢిల్లీ: బీహార్‌లో ఓ మహిళ మొదటి సారిగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మొబైల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఉపయోగించింది. వివరాల్లోకి వెళితే పాట్నాలో ఓ మహిళ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ పోలీసుపై వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పాట్నా సీనియర్ ఎస్పీ జితేంద్ర రాణా తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న అనంతరం విచారణ చేపట్టి ఆ పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే పాట్నా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ ఘటనలో పోలీసు అధికారి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి బలవంతంగా ఫోన్ నెంబర్ తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆ సమయంలో ఆమె స్నేహితురాలు ఆ పోలీసు అధికారి ఫోటోతీయగా దాన్ని ఆమె వాట్సాప్ ద్వారా పోలీసులకు పంపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈ పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications