50 ఏళ్ల వయసులో 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే..?
మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అని పిల్లల విషయంలో ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలని కనండి అంటూ ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తున్నాయి. వీటికి తోడు మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా నేతి తరం ఎక్కువగా సంతాన లేమి సమస్యలను కూడా ఎదుర్కుంటుంది. కానీ ఓ జంట మాత్రం అదేదో సినిమాలు డైలాగ్ చెప్పినట్టు.. తెల్లార్లు పోరాటమే పనిగా పెట్టుకున్నారా అనేలా చేసి చూపించారు.
అయితే పిల్లల విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి ఇక్కడ ఎటువంటి విమర్శలకు తావులేదు. 50 ఏళ్ల వయసులో ఓ మహిళ ఏకంగా 14వ బిడ్డకు జన్మనివ్వడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సదరు మహిళ పేరు 'గుడియా' గా తెలుస్తోంది. ఆమె భర్త పేరు ఇమాముద్దీన్ అని చెబుతున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు ఆమెకు 13 మంది పిల్లలు ఉండగా.. 14వ సంతానంగా ఆడ శిశువు జన్మించింది.

గుడియాకు 9 నెలలు నిండక ముందే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే గుడియాకు ప్రసవం జరిగి ఆడపిల్ల పుట్టింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీంతో వారు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడియా వయసు ఇప్పుడు 50 ఏళ్లు కాగా.. ఆమె పెద్ద బిడ్డ వయసు 22 ఏళ్లు అని అంటున్నారు.
ఈ విషయం వ్యాప్తి చెందడంతో గుడియా, ఆమెకు పుట్టిన 14వ బిడ్డ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తనకు మొత్తం 9 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని.. నలుగురు అబ్బాయిలు.. ఐదుగురు అమ్మాయిలు పుట్టారని గుడియా చెబుతోంది. అందులో ముగ్గురు చనిపోయారని స్థానిక మీడియాకు వెల్లడించింది. 14 మంది పిల్లలు ఉన్నారనే విషయం అబద్ధమని స్పష్టం చేసింది. కానీ ఆమెకు ఇంతకు ముందు 13 మంది పిల్లలు ఉన్నారని ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు తెలిపారు.
A 50-year-old woman from Uttar Pradesh's Hapur district gave birth to her 14th child, a baby girl; her oldest child, a 22-year-old man, stayed with his mother after she gave birth to his newest sister. Both mother and child are doing well. Gudiya, the wife of a man named… pic.twitter.com/43yoqMbRTH
— The Siasat Daily (@TheSiasatDaily) March 30, 2025












Click it and Unblock the Notifications