జైల్లో దాండియా ఆడిన మహిళా ఖైదీలు...
దసరా పండుగ నేపథ్యంలో దేవీ నవరాత్రులు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అందరూ నవరాత్రి సందర్భంగా గార్బా, దాండియా ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఈ ఆటలు ఎక్కవగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడతారు. గార్భా వేడుకలను ఉత్తరాది రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఈ దాండియా ఆటకు సంబందించిన ఒక వీడియో ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జైల్లో దాండియా ఆడుతూ కొందరు మహిళా ఖైదీలు సందడి చేశారు. ఈ వీడియో ఇప్పడు నెట్టింట తెగ హాల్చల్ చేస్తోంది.
#WATCH | Madhya Pradesh: Garba organised in Indore Central Jail on the occasion of #Navratri2023 pic.twitter.com/Y4pct1TL8x
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 20, 2023
మహిళా ఖైదీల గార్భా నృత్యం...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సెంట్రల్ జైల్లో కూడా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా గార్భా, దాండియా వేడుకలను నిర్వహించారు. అయితే ఇందులో భాగంగదా జైల్లో ఉన్న మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ అక్కడున్నవారందరిని మైమరిపించారు. మహిళా ఖైదీల దాండియాకు సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది. గతేడాది కూడా ఇండోర్ సెంట్రల్ జైల్లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ప్రతి ఏడాది ఇక్కడ మహిళా ఖైదీలు గార్భా వేడుకల్లో పాల్గొనడం సహజమే. ఈ మహిళ ఖైదీలు దాండియా ఆడుతూ, తమ బాధలను, కష్టాలను మరిచిపోతున్నారు. దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న జైలు అధికారులకు మహిళా ఖైదీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
గార్భా, దాండియా జానపద నృత్యాలే..
గార్బా, దాండియా రెండూ కూడా గుజరాతి నృత్యాలే. దాండియా హారతి తర్వాత సాయంత్రం ఆనందంగా చేసే నృత్యం. లయబద్ధమైన దాండియా కర్రలతో దరువు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శించే నృత్యాన్నే దాండియా అంటారు.
ఇందులో రంగురంగుల కర్రలు ఉపయోగించి దాండియా ఆడటం ప్రత్యేకం. దాండియా ఆడేందుకు బృందంలో సరి సంఖ్యలో వ్యక్తులు ఉండాలి. దాండియా పాటలు కృష్ణలీల గురించే ఎక్కువగా ఉంటాయి. గార్బా, దాండియా రెండూ కూడా నవరాత్రి సమయంలో చేసినప్పటికీ రెండింటిలోనూ కొన్ని తేడాలు ఉన్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications