Viral Video: వామ్మో కుక్కలు.. కారును గుద్దేసిన స్కూటీ.. వీడియో వైరల్..

దేశంలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. తాజాగా వీధి కుక్కల వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూటీపై ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, కుక్క పిల్ల వస్తున్నారు. అయితే వారిని చూసిన వీధి కుక్కలు ఆరుస్తూ స్కూటీని వెంబడించాయి. దీంతో బయటపడిన వారు కుక్కలను చూస్తూ స్కూటీని నడిపారు. ఈ క్రమంలో పక్కకు పార్కు చేసి ఉన్న కారును ఢీకొట్టి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వారు స్వల్పంగా గాయపడగా.. వెంబడించిన కుక్కలు వెనక్కు వెళ్లాయి.

ఈ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్‌ పట్టణంలో జరిగింది. తెలంగాలో కూడా వీధి కుక్కల దాడులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కుక్కలు కరిచాయి. ఏప్రిల్ 1వ రాత్రి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్‌ ఆవరణలో వాకింగ్‌ చేస్తుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ రెడ్డిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడిని కూడా కుక్క కరిచింది.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడినిపై కుక్కలు దాడి చేసి చంపాయి. ఆ తర్వాత రాష్ట్రంలో కుక్క కాటు ఘటనలు ఎన్నో జరిగాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఓ బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కలను అదుపు చేయాలని అధికారులను కోరుతున్నారు.

 dogsattack

ఉన్నతస్థాయి అధికారులకే కుక్క కాట్లు తప్పడం లేదంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కుక్క అప్పుడే పుట్టిన శిశువును నోట కరుచుకుని ఆస్పత్రి ఆవరణలో తిరిగిన ఘటన సంచలనం సృష్టించింది.

దేశంలో సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో తెలిపింది. కుక్క కాటుకు గురైన వారులో 17 నుంచి 20 వేల మంది వరకు రేబిస్ వైరస్ బారిన పడుతున్నారని నివేదికలో పేర్కొంది. అంటే ప్రతి రెండు సెకండ్లకు ఒక్క కుక్క కాటు, ప్రతి అరగంటకు ఒక రేబిస్ మరణం సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలు పరిశీలిస్తే మన భారత్ లోనే 36 శాతం మంది రేబిస్ వల్ల చనిపోతున్నట్లు నివేదికలో వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+