శ్రీహరికోటలో చంద్రయాన్ 3 కోలాహలం
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
— ISRO (@isro) July 5, 2023
ఈ నెల 13వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓ భారీ ట్రక్‌పైకి చంద్రాయన్ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అనంతరం దీన్ని ఎల్‌వీఎం 3తో జత చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ ఎల్‌వీఎం 3. ఇది తొలిదశ. ఆ తరువాత దీన్ని లాంచ్ ప్యాడ్‌కు తరలిస్తారు.

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను మోసుకెళ్లడానికి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని వినియోగించనుంది ఇస్రో.
రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే తమ ప్రయత్నమని సోమనాథ్ వివరించారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు పునరావృతం కానివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోన్నామని చెప్పారు. గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది.
చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది. ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది.












Click it and Unblock the Notifications