World Beer Awards 2025: ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారతీయ బీర్.. నెం.1 గుర్తింపు!
World Beer Awards 2025: భారతీయ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్ 'సింబా'(Simba) అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఈ గుర్తింపుతో భారతీయ క్రాఫ్ట్ బీర్లు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని రుజువైంది. సింబా విట్(Simba Wit) సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. సింబా స్టౌట్(Simba Stout) బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈ అవార్డులు భారతీయ క్రాఫ్ట్ బీర్ నాణ్యత, వినూత్నతను ప్రపంచానికి చాటి చెప్పాయి. ప్రపంచంలోని గొప్ప పోటీల్లో ఒకటైన వరల్డ్ బీర్ అవార్డ్స్, బ్రూవర్స్, నిపుణులు, రైటర్స్ వంటి వారిచే బ్లైండ్ టేస్టింగ్ ద్వారా జడ్జిమెంట్ జరుగుతుంది.
సింబా విట్, సింబా స్టౌట్ ప్రత్యేకతలు
సింబా విట్(Simba Wit): ఇది బెల్జియన్-స్టైల్ గోధుమ(వీట్) బీర్. ఇందులో గోధుమ మాల్ట్, కొత్తిమీర, ఆరెంజ్ పీల్ ఉపయోగించడం వల్ల దీని రిఫ్రెషింగ్ సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. ఇది తాగడానికి సులభంగా, తేలికగా ఉంటుంది.

సింబా స్టౌట్(Simba Stout): ఇది ఒక సాంప్రదాయ స్టౌట్ బీర్. ఇందులో రోస్టెడ్ బార్లీ, డార్క్ మాల్ట్ లు ఉపయోగించడం వల్ల కాఫీ, చాక్లెట్, కారామెల్ నోట్స్ వంటి రుచులు వస్తాయి.
ఈ రెండు బీర్లు అత్యున్నత నాణ్యత గల పదార్థాలు, సాంప్రదాయ బ్రూయింగ్ పద్దతులను ఉపయోగించి, ఆధునిక శైలిలో తయారు చేయబడ్డాయి. బ్రూయింగ్ ప్రక్రియలో నాణ్యమైన మాల్ట్‌లు, హాప్‌లు, ఈస్ట్ వినియోగించబడతాయి. ఇది ప్రతి బ్యాచ్‌లో స్థిరమైన రుచిని నిర్ధారిస్తుంది.
సాల్ట్‌బోర్న్: సింబాకు మద్దతు
సింబా బ్రాండ్ 'సాల్ట్‌బోర్న్' అనే కంపెనీలో భాగం. సాల్ట్‌బోర్న్ వ్యవస్థాపకులు ఇశ్వరాజ్ సింగ్ భటియా, అతని భాగస్వామి. నాణ్యత, ప్రామాణికత, వినూత్నతపై దృష్టి సారించి ప్రీమియం కన్స్యూమర్ ప్రొడక్టులను తయారు చేయడమే ఈ కంపెనీ లక్ష్యం. సాల్ట్‌బోర్న్ విజన్, దాని మద్దతు సింబా అంతర్జాతీయంగా ఎదగడానికి కీలక పాత్ర పోషించాయి. ఈ అవార్డులు కేవలం సింబాకు మాత్రమే కాకుండా.. మొత్తం భారతీయ క్రాఫ్ట్ బీర్ పరిశ్రమకు ఒక గొప్ప విజయాన్ని సూచిస్తాయి. భారతీయ పానీయాల పరిశ్రమలో నాణ్యత, ఆవిష్కరణలు, సాంస్కృతిక వ్యక్తీకరణ వైపు పెరుగుతున్న ఒక ఉద్యమాన్ని సింబా విజయం ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో ఈ గ్లోబల్ గుర్తింపు సింబాతో పాటు ఇతర భారతీయ బ్రూవర్లకు మరింత స్ఫూర్తినిస్తుందని భావించవచ్చు.












Click it and Unblock the Notifications