వామ్మో.. పూర్తిగా మునిగిపోయిన మెట్రో స్టేషన్.. వీడియో వైరల్

ఆర్థిక రాజధాని ముంబై.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షానికి ముంబై నగరం మునిగిపోతోంది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోడ్లు, ఇళ్లు, కాలనీలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Worli Metro Station Submerged in Mumbai Rains Video Goes Viral

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. 24 గంటలకు పైగా కురుస్తున్న కుండపోత వర్షానికి ముంబైలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. మెట్రో స్టేషన్లు, కాంప్లెక్స్ లు, కాలనీలు, ఇళ్లు.. అన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ముంబై, థానే, రాయ్ గఢ్, రత్నగిరి ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

మరోవైపు భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నీట మునిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మెట్రో స్టేషన్ లోకి మాత్రమే కాకుండా ట్రైన్‌ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరడంతో అక్కడి పరిస్థితి ఆందోళన కరంగా మారింది. స్టేషన్ లోని అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ భారీగా నీరు చేరింది.

ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కుండపోత వానల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం కావడంతో వాతావరణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఓవైపు కరెంట్ నిలిచిపోయింది. మరోవైపు రవాణా వ్యవస్థ ఆగిపోయింది. నగరంలోని రోడ్లన్నీ చెరువులును తలపిస్తున్నాయి. దీంతో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది.

మహారాష్ట్రలో ఈసారి పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే 1990 తర్వాత సీజన్‌ కంటే ఇంత ముందుగా ముంబై నగరంలో వర్షాలు పడటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+