Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

బెంగళూరు: అక్రమ సంబంధాల కారణంగా భార్యలను ఎలా హత్య చెయ్యాలో భర్తలు ప్లాన్ చేస్తుంటే, భర్తలను ఎలా లేపేయాలో భార్యలు స్కెచ్ లు వేస్తున్నారు. ఇక్కడ కథ వేరుగా ఉంది. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టున్నాడని భార్య కూడా వాళ్ల హోటల్ లోనే పని చేస్తున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్న భర్త తనకు డబ్బులు ఇవ్వలేదని భార్య రగిలిపోయింది. నా ఇంట్లో గుడ్డు పెట్టాల్సిన కోడి వేరే ఇంట్లో పెడుతోందని రగిలిపోయిన భార్య ఎలాగైన భర్తను చంపేశాయని ప్లాన్ వేసింది యూట్యూబ్ లో చూసిందో ఏమో 2020లో కాదు కానీ ఎప్పుడు ఎక్కడా విననివిదంగా రాగిముద్ద మర్డర్ ప్లాన్ వేసి భర్తను చాకకచక్యంగా చంపేసి అడ్డంగా బుక్కైపోయింది.

ఎగ్ రైస్ లో కింగ్

ఎగ్ రైస్ లో కింగ్


కర్ణాటకలోని దావణగెరెలోని జగళూరు పట్టణంలో బిదరకెరె ప్రాంతంలో బసవరాజప్ప అలియాస్ ఎగ్ రైస్ బసవరాజ్, భాగ్యమ్మ అలియాస్ భాగ్య దంపతులు నివాసం ఉంటున్నారు. జగళూరులో బసవరాజ్ తో పాటు చాలా మంది ఎగ్ రైస్ వ్యాపారం చేస్తున్నారు. అయితే జగళూరులో ఎవరైనా ఎగ్ రైస్ తినాలంటే మొదట బసవరాజ్ హోటల్ కే ప్రాధాన్యత ఇస్తారు. రుచికరమైన ఎగ్ రైస్ చెయ్యడంలో బసవరాజ్ హోటల్ చాలా పేరు సంపాధించుకుంది. ఎగ్ రైస్ బసవగా బసవరాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాళ్లు చాపుకుని డబ్బు సంపాధించాడు

కాళ్లు చాపుకుని డబ్బు సంపాధించాడు

ఎగ్ రైస్ వ్యాపారంలో తనకు తానే సాటి అని నిరూపించుకుని బసవరాజ్ కాళ్లు చాపుకుని హ్యాపీగా ప్రతిరోజు వేల రూపాయల సంపాధిస్తున్నాడు. అయితే సంపాధించిన డబ్బులు చాలా వరకు భార్య భాగ్యకు బసవరాజ్ ఇవ్వడం లేదని తెలిసింది. తనకు ఎందుకు డబ్బులు ఇవ్వకుండా భర్త బసరాజ్ తెలివిగా తప్పించుకుంటున్నాడు ? అంటూ భార్య భాగ్య ప్రతిరోజూ ఆరా తీస్తూ వచ్చింది.

నా కోడి గుడ్డు కౌసల్య ఇంట్లో పెడుతుందా... చూస్తా

నా కోడి గుడ్డు కౌసల్య ఇంట్లో పెడుతుందా... చూస్తా

ఎగ్ రైస్ వ్యాపారి బసవరాజ్ కు జగళూరులోనే కౌసల్య అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని భార్య భాగ్యకు తెలిసింది. నా భర్త బసవరాజ్ నా ఇంట్లో గుడ్డు పెట్టకుండా కౌసల్య ఇంట్లో గుడ్డు పెడుతున్నాడని తెలుసుకున్న భార్య భాగ్య రగిలిపోయింది. రోజూ ఇంట్లో భర్త బసవరాజ్ అక్రమ సంబంధం విషయంలో భార్య భాగ్య గొడవపెట్టుకునేది. అయినా బసవరాజ్ మాత్రం రోజూ సంపాధిస్తున్న డబ్బులో సగభాగం ప్రియురాలు కౌసల్యకు తగలేస్తూ ఎంజాయ్ చేశాడు.

భార్య భాగ్య సామాన్యురాలు కాదు

భార్య భాగ్య సామాన్యురాలు కాదు

బసవరాజ్ భార్య భాగ్య వారి హోటల్ లో పని చేస్తున్న అంజినప్పతో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్త బసవరాజ్ నడుపుతున్న హోటల్ కు మంచి పేరు ఉందని, తన భర్త చెప్పినమాట వినడం లేదని, అతన్ని చంపేస్తే హోటల్ లో వచ్చే లాభం మొత్తం తనకే వస్తుందని భాగ్య ఆలోచించింది. అంతే భాగ్యకు సన్నిహితంగా ఉంటున్న జగళూరులోని నింగనహళ్ళి నివాసి, తన భర్త హోటల్ లో పని చేస్తున్న అంజినప్పకు విషయం మొత్తం చెప్పి నా భర్తను చంపేయాలని స్కెచ్ వేసింది. అంజినప్ప అతని స్నేహితులైన చౌడప్ప, ఆటో డ్రైవర్ మారుతి కలిసి బసవరాజ్ ను చంపేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా ఉందో ? లేదో

ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా ఉందో ? లేదో

భర్త బసవరాజ్ ను హత్య చేస్తే మీకు రూ. 1 లక్ష ఇస్తానని భార్య భాగ్య వారి హోటల్ లో పని చేస్తున్న అంజినప్పతో డీల్ మాట్లాడుకునింది. రాత్రి హోటల్ లో వ్యాపారం ముగించుకున్న బసవరాజ్ ఫుల్ గా లిక్కర్ వేసుకుని ప్రియురాలు కౌసల్య ఇంటికి వెళ్లి ప్రజెంట్ మేడమ్ అంటూ ఆమెతో ఎంజాయ్ చేసి తరువాత అతని ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఇంట్లో రాగి ముద్దలో 10కి పైగా నిద్రమాత్రలు కలిపి ముద్ద చేసిన భాగ్య ఇంటికి వెళ్లిన భర్త బసవరాజ్ కు పెట్టింది. భర్తకు అనుమానం రాకుండా నిద్రమాత్రలు కలపకుండా చేసిన మరో రాగి ముద్దను భాగ్య కూడా పెట్టుకుని భర్తతో కలిసి భోజనం చేసింది. ఇలాంటి స్కెచ్ యూట్యూబ్ లో కూడా ఉందో ? లేదో ? అనే విషయం ఆదేవుడికే తెలియాలి.

గ్రహాలు అనుకూలించలేదు

గ్రహాలు అనుకూలించలేదు


నిద్రమాత్రలు కలిపిన రాగిముద్ద తిన్న బసవరాజ్ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన అంజినప్ప, చౌడప్పతో కలిసి భార్య భాగ్య భర్త బసవరాజ్ గొంతు నులిమి చంపేశారు. ఆటో డ్రైవర్ మారుతి సహాయంతో బసవరాజ్ శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేశారు. మరుసటి రోజు బసవరాజ్ శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. తన భర్త బసవరాజ్ కు కౌసల్యతో అక్రమ సంబంధం ఉందని, ఆమె హత్య చేయించి ఉంటుందని భాగ్య నాటకాలు ఆడింది. అయితే పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తే వారి దిమ్మతిరిగిపోయింది. ఎగ్ రైస్ వ్యాపారి బసవరాజ్ హత్య కేసులో అతని భార్య భాగ్యతో పాటు వారి హొటల్ లో పని చేస్తున్న అంజినప్ప, చౌడప్ప, ఆటో డ్రైవర్ మారుతిని 24 గంటల్లోపు అరెస్టు చేశారు 2020లో ఇలాంటి రాగిముద్దతో హత్య చేసినట్లు భారతదేశంలో ఎక్కడా నమోదు కాలేదు అంటే నమ్మండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+