Young lady: కంపెనీ సీఈవో కు కుచ్చుటోపీ పెట్టిన కిలాడి, ప్రేమ పేరుతో లక్షలు స్వాహా, ఎస్కేప్ !
బెంగళూరు: ఓ కంపెనీ సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ మాల్యకు ఓ యువతి కరెక్టుగా కుచ్చుటోపీ పెట్టేసింది. ప్రేమ, పెళ్లి అంటూ ఆ శ్రీమంతుడితో ఆమె చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేసింది. పెళ్లి టాపిక్ వస్తే ఈ రోజు, రేపు అంటూ కాలం గడిపేసింది. ప్రియుడు బిగ్ షాట్ కావడంతో అప్పుడప్పుడు లక్షల రూపాయలు నొక్కేసింది. పెళ్లి గడువు దగ్గర పడటంతో ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని జెండా ఎత్తేసింది. కొంప మునిగిందని ఆలస్యంగా గుర్తించిన అనంత్ మాల్య ఇప్పుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు.

బిగ్ షాట్ తో లవ్
బెంగళూరులో నివాసం ఉంటున్న అనంత్ మాల్య అనే పారిశ్రామికవేత్త క్వాన్ టెక్ కన్సల్టెన్సీ కపెంనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ సీఈవో అయిన అనంత్ మాల్య వ్యాపారం పనుల మీద అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఇదే సమయంలో అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో అనంత్ మాల్యకు పరిచయాలు అయ్యాయి.

టచ్ లోకి స్వీట్ లేడీ
2019 జూన్ నెలలో బెంగళూరులో నివాసం ఉంటున్న రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని సీఈవో అనంత్ మాల్యకు పరిచయం అయ్యింది. తరువాత రమ్య, అనంత్ మాల్య పరిచయం ప్రేమకు దారితీసింది. రమ్యను ప్రేమించడానికి అనంత్ మాల్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

నిలువు దోపిడీ చేసిందా ? లూటీ చేసిందా
రమ్య మాయలో పడిపోయిన అనంత్ మాల్య ఆమె అడిగినప్పుడంతా లక్షలు లక్షలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. చిట్ ఫడ్ వ్యవహారం అంటూ, ఇంటి స్థలం లావాదేవీలు అంటూ ఇప్పటి వరకు సీఈవో అనంత్ మాల్య నుంచి ఆయన ప్రియురాలు రమ్య సుమారు రూ. 36.20 లక్షలు తీసుకునింది.

జెండా ఎత్తేసిన మేడమ్
ప్రియుడు అనంత్ మాల్య నుంచి తీసుకున్న డబ్బుల్లో రమ్య ఆయనకు రూ. 6.90 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించింది. పెళ్లి విషయం టాపిక్ వస్తే ఈరోజు, రేపు అంటూ రమ్య తప్పించుకుని తిరిగిందని తెలిసింది. రానురాను ప్రియుడు అనంత్ మాల్యకు దూరం అయిన రమ్మ ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాయం అయ్యింది.

కిలాడీ లేడీ మీద చీటింగ్ కేసు
మోసపోయాను అని ఆలస్యంగా గుర్తించిన అనంత్ మాల్య బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్, కేసు నమోదు చేసిన పోలీసులు మాయం అయిన కిలాడీ లేడీ కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద ఓ కంపెనీ సీఈవోను ప్రేమ పేరుతో నిలువునా ముంచేసిన యువతి ఎవరు ? అని అందరూ చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications