lovers: ఫేస్ బుక్ లవర్స్, గుండెపోటుతో ప్రియురాలు మృతి, ప్రియుడి ఆత్మహత్య, సినిమా స్టైల్లో లవ్ !

చెన్నై/ కల్లకురుచ్చి: కుటుంబ సభ్యులు బాగా చదువుకోవాలని చెప్పినా అతను చదువు మీద పెద్దగా శ్రద్ద చూపించలేదు, అతి కష్టం మీద 8వ తరగతి వరకు చదివిన అతను తరువాత ఫోటోగ్రఫీ మీద శ్రద్ద చూపించాడు. మంచి ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు సొంతంగా ఓ స్టూడియో పెట్టుకున్నాడు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి ఫోటోలు తీస్తున్న ఆ యువకుడు ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఎక్కుగా కాలం గడుపుతున్నాడు. చదివింది 8వ తరగతి అయినా అతనికి సోషల్ మీడియాలో మంచి పట్టుఉంది. ఫేస్ బుక్ లో ఆ యువకుడికి ఓ మహిళ పరిచయం అయ్యింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువకుడు, ఆమె ప్రేమించుకున్నారు.

ఒక్కసారికూడా చూసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు యువతి, యువకుడు సినిమా స్టైల్లో ప్రేమించుకున్నారు. ప్రతిరోజు ఇద్దరూ గంటలు గంటలు ఫోన్ లొ మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కొన్ని నెలల ముందు డిసైడ్ అయ్యారు. అయితే ఐదు రోజుల నుంచి యువతి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చెయ్యకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె ప్రియుడికి పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఐదు రోజుల తరువాత ప్రియుడు అతని ప్రియురాలి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసిన అమ్మమ్మ నీ స్నేహితురాలు గుండెపోటుతో చనిపోయిందని చెప్పింది. అప్పటి నుంచి ఆవేదన చెందిన యువకుడు ప్రియురాలు ఉన్న చోటకే నేను వెళ్లిపోతే ఎలాంటి సమస్య ఉండదని ఆవేశంతో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 8వ తరగతికే చదువు అటకెక్కింది

8వ తరగతికే చదువు అటకెక్కింది

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలోని రిషివండియం సమీపంలోని మేలతేనూరు గ్రామంలో శక్తివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శక్తివేల్ కు మణికందన్ అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యులు బాగా చదువుకోవాలని చెప్పినా మణికందన్ చదువు మీద పెద్దగా శ్రద్ద చూపించలేదు, అతి కష్టం మీద 8వ తరగతి వరకు చదివిన మణికందన్ తరువాత ఫోటోగ్రఫీ మీద శ్రద్ద చూపించాడు.

 సోషల్ మీడియా మీద పట్టు

సోషల్ మీడియా మీద పట్టు

మంచి ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న మణికందన్ కు ప్రస్తుతం 26 సంవత్సరాలు. సేలం జిల్లాలోని బేతనాయకన్ ఎస్టేట్ ప్రాంతంలో మణికందన్ సొంతంగా ఓ స్టూడియో పెట్టుకున్నాడు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి ఫోటోలు తీస్తున్న మణికందన్ ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఎక్కుగా కాలం గడుపుతున్నాడు. చదివింది 8వ తరగతి అయినా మణికందన్ సోషల్ మీడియాలో మంచి పట్టుఉంది.

 ఫేస్ బుక్ లవర్

ఫేస్ బుక్ లవర్

ఫేస్ బుక్ లో మణికందన్ కు భూమిక అనే మహిళ పరిచయం అయ్యింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన భూమిక, మణికందన్ తరువాత ప్రేమించుకున్నారు. మణికందన్, భూమిక ఇంతవరకు ఒక్కసారికూడా చూసుకోలేదు. కొన్ని సంవత్సరాల పాటు భూమిక, మణికందన్ సినిమా స్టైల్లో ప్రేమించుకున్నారు. ప్రతిరోజు భూమిక, మణికందన్ ఇద్దరూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకున్నారు.

 ప్రియురాలి ఫోన్ స్విచ్ ఆఫ్

ప్రియురాలి ఫోన్ స్విచ్ ఆఫ్

మణికందన్, భూమిక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కొన్ని నెలల ముందు డిసైడ్ అయ్యారు. అయితే ఐదు రోజుల నుంచి భూమిక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చెయ్యకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె ప్రియుడు మణికందన్ కు పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఐదు రోజుల తరువాత ప్రియుడు మణికందన్ అతని ప్రియురాలు భూమిక ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసిన భూమిక అమ్మమ్మ నీ స్నేహితురాలు గుండెపోటుతో చనిపోయిందని చెప్పడంతో మణికందన్ హడలిపోయాడు.

 విషం తాగిన ప్రియుడు

విషం తాగిన ప్రియుడు

ప్రియురాలు భూమిక చనిపోయింది అని తెలుసుకున్న మణికందన్ ఆవేదన చెందాడు. తన ప్రియురాలు భూమిక ఉన్న చోటకే నేను వెళ్లిపోతే ఎలాంటి సమస్య ఉండదని ఆవేశంతో మణికందన్ ఇంట్లో ఉన్న విషం తాగేశాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు మణికందన్ ను కల్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 మ్యాటర్ మొత్తం చెప్పి ప్రాణాలు వదిలేశాడు

మ్యాటర్ మొత్తం చెప్పి ప్రాణాలు వదిలేశాడు

చికిత్స పొందుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఎందుకు విషం తాగావు అని మణికందన్ ను ప్రశ్నించారు. ఆ సమయంలో మణికందన్ అతని ప్రియురాలు భూమిక విషయం అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మణికందన్ చనిపోయాడని పోలీసులు అన్నారు. ఫేస్ బుక్ ప్రియురాలు భూమిక గుండెపోటుతో చనిపోవడంతో ఆవేదనతో ఆమె ప్రియుడు మణికందన్ కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+