viral video:ఏందిరా అయ్యా..ఇదీ, నడిచే కారు మీద ఫీట్, వైరల్
వెర్రి వెయ్యి విధాలు అంటారు. ఊరికే ఉండకుండా కొందరు చిత్ర, విచిత్రాలు చేస్తుంటారు. కొందరు బైకులపై ఫీట్లు చేస్తూనే ఉన్నారు. మరికొందరు కార్లతో సాహసాలు చేస్తున్నారు. వారికి సరదా కానీ.. పక్కవారికి మాత్రం గుండెల్లో గుబుల్ రేపుతుంటుంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దానిని కొందరు వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

కారుపై యువకుడి ఫీట్
ఓ యువకుడు కారుపై ఫీట్ చేశాడు. కారు డ్రైవర్ వద్ద డోర్ తెరచి కూర్చున్నాడు. డోర్ గ్లాస్ మీద ఒక కాలు.. డ్రైవర్ సీటు మీద మరొ కాలు పెట్టాడు. అలా కాసేపు పయనించాడు. అతనికి ఏం థ్రిలో కానీ చుట్టుపక్కల ఉండేవారికి మాత్రం భయపడి ఉంటారు. అయితే ఈ వీడియో రాత్రి సమయంలో తీసింది కావడంతో ఆ సమయంలో మరే వాహనం లేదు. రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను ఆ కుర్రాడు బ్రేక్ చేశాడు. తనకెందుకులే అని బిహెవ్ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

రూల్స్ బ్రేక్ చేశారో అంతే..
ఎవరయినా సరే నియమ, నిబంధనలు పాటించాల్సిందే.. ఇందులో సందేహాం లేదు. కానీ అతను మాత్రం మోనార్క్ మాదిరిగా ప్రవర్తించాడు. కారు డ్రైవ్ చేస్తూ మరీ వీడియో తీయించుకున్నాడు. అయితే ఆ రహదారిపై ఒక్క సీసీటీవీ కెమెరా లేకపోవడం విశేషం. రోడ్ కోసం మాత్రం రూ.1100 కోట్లను ఖర్చు చేశారు. కానీ కెమెరా ఇన్ స్టాల్ చేయడం మాత్రం మరచిపోయారు. దీంతో ఎవరు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. అలా యువకుడు కూడా నడిచే కారు మీద ఫీట్ చేశాడు. మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో చక్కర్లు కొడుతుంది.
ఫీటా.. రికార్డా..? అంటూ ఫైర్
వీడియోపై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం పద్దతి అని ప్రశ్నిస్తున్నారు. ఆ కుర్రాడు మిగతా యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దేవుని కృప వల్ల ఏమీ కాలేదు.. అదే ఏదైనా జరగరాని ఘోరం జరిగితే.. అందుకు బాధ్యులు ఎవరూ అని అడుగుతున్నారు. నిర్లక్ష్యం వల్ల అతనికే కాదు.. ఆ సమయంలో ఆ దారి గుండా వెళ్లే వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆ యువకుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా.. కారు మీద రాజసం ఒలకబోస్తూ కూర్చున్నాడు. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూజర్లు చాలా మంది తిట్టిపోస్తున్నారు. ఇదేమైనా ఫీట్ కోసం చేశావా..? రికార్డు కోసం స్టంట్ అని మండిపడ్డారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications