Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: బావ చెయ్యి నరికి బ్యాగ్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బావమరిది, రేయ్... ఏందిరా ఇది, కథ చాలా జరిగింది !

బెంగళూరు/ మైసూరు: ఐదు నెలల క్రితం కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఆ ఇంటి అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు. బావ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని, మా అమ్మాయి జీవితాంతంగా సుఖంగా ఉంటుందని ఆమె సోదరులు అనుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలకే లొల్లి మొదలైయ్యింది. బెంగళూరులో కాపురం పెట్టాలని, నువ్వు రావాలని భర్త చెప్పాడు. లేదు నువ్వే మైసూరు వచ్చి ఏదో ఒకని చేసుకోవాలని భార్య చెప్పింది. రోజు ఇదే పంచాయితీతో భర్త విసిగిపోయాడు. నువ్వు వస్తే ఇక్కడికే రా, లేదంటే నేను బెంగళూరుకు రాను అని భార్య తేల్చి చెప్పింది.

నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని నాతో రాను అంటున్నావు, అలాంటప్పుడు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అంటూ భర్త గొడవ చేసేశాడు. నువ్వు ఏమైనా అనుకో నేను మాత్రం బెంగళూరుకు రాను అని భార్య తేల్చి చెప్పింది. పెద్దలు పంచాయితీలు చేస్తున్న సమయంలో ఓ సంఘటన కలకలం రేపింది. భార్య సోదరుడు ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసులు బ్యాగ్ తీసి లోపల చూస్తూ యువకుడి చేయ్యి, కొడవలి ఉంది. ఓరి దేవుడా ఏందిరా ఇది అని ఆ యువకుడిని ప్రశ్నిస్తే సార్ ఇది మా బావ చెయ్యి, డెడ్ బాడీ ఇంట్లో ఉందని చెప్పడంతో పోలీసులు మతిపోయింది. సొంత బావను అతని బావమరిది హత్య చెయ్యడం వెనుక చాలా కథ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఐదు నెలల ముందు పెళ్లి

ఐదు నెలల ముందు పెళ్లి

కర్ణాటకలోని మైసూరు నగరంలో రాజాజీనగర్ లో మోహమ్మద్ సరన్ సునైనా (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మైసూరులోని ఉదయగిరిలో నివాసం ఉంటున్న అల్మద్ షాషా అనే ఆయన కుమార్తెతో ఐదు నెలల క్రితం మోహమ్మద్ వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఆ రోజు మోహమ్మద్ వివాహం జరిగింది. పెళ్లి కూతురికి కదీర్ షాషా, అజ్మల్ పాషా అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

 బెంగళూరులో భర్తకు ఉద్యోగం

బెంగళూరులో భర్తకు ఉద్యోగం

పెళ్లి కొడుకు మోహమ్మద్ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని, మా అమ్మాయి జీవితాంతంగా సుఖంగా ఉంటుందని పెళ్లి కూతురు సోదరులు కదీర్, అజ్మల్ అనుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలకే మోహమ్మద్ కు అతని భార్యతో లొల్లి మొదలైయ్యింది. బెంగళూరులో కాపురం పెడుదామని రావాలని భర్త మోహమ్మద్ అతని భార్యకు చెప్పాడు. లేదు నువ్వే మైసూరు వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలని భార్య ఆమె భర్త మోహమ్మద్ కు చెప్పింది.

 భార్యకు అక్రమ సంబంధం ఉందని ?

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?

రోజు ఇదే పంచాయితీతో భార్య తీరుతో మోహమ్మద్ విసిగిపోయాడు. నువ్వు వస్తే ఇక్కడికే రా, లేదంటే నేను బెంగళూరుకు రాను అని భార్య తేల్చి చెప్పింది. నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని నాతో రాను అంటున్నావు, అలాంటప్పుడు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అంటూ భర్త మోహమ్మద్ అతని భార్యతో గొడవ చేశాడు. నువ్వు ఏమైనా అనుకో నేను మాత్రం బెంగళూరుకు రాను అని భార్య మోహమ్మద్ కు తేల్చి చెప్పింది.

 రాజీ ప్రయత్నాలు చేసిన పెద్దలు

రాజీ ప్రయత్నాలు చేసిన పెద్దలు

తన కుమార్తె శీలం మీద అనుమానం పెంచుకున్న మోహమ్మద్ మీద అత్తమామలతో పాటు అతని బావమరుదులు మండిపడ్డారు. కొన్ని రోజుల నుంచి ఇరు కుటుంబాల మద్య గొడవలు జరుగుతున్నాయి. మైసూరులోని రాజాజీనగర్ లో మోహమ్మద్ ఉన్నాడు. నీతో మాట్లాడలని చెప్పిన అతని బావమరుదులు కదీర్, అజ్మల్ పాషా అతన్ని ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లారు. మైసూరులోని గౌసియా నగర్ లోని బంధువుల ఇంటికి పిలుచుకుని వెళ్లి అక్కడ మోహమ్మద్ ను పట్టుకుని చితకబాదేశారు.

 బావ చెయ్యి నరికి ఎత్తుకుపోయిన బావమరిది

బావ చెయ్యి నరికి ఎత్తుకుపోయిన బావమరిది

మోహమ్మద్ ను చితకబాదేసిన తరువాత అతని అత్తారింటి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. పదునైన కొడవలి తీసుకున్న భార్య కుటుంబ సభ్యులు మోహమ్మద్ కాళు, చెయ్యి పూర్తిగా నరికేశారు. కాళు, చెయ్యి పూర్తిగా తెగిపోవడంతో మోహమ్మద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బావ మోహమ్మద్ చెయ్యి బ్యాగ్ లో పెట్టుకున్న అతని బావమరిది నేరుగా ఉదయగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

 బ్యాగ్ లో చెయ్యి మాత్రమే ఉంది.... డెడ్ బాడీ అక్కడే ఉంది

బ్యాగ్ లో చెయ్యి మాత్రమే ఉంది.... డెడ్ బాడీ అక్కడే ఉంది

భార్య సోదరుడు కదీర్ ఓ బ్యాగ్ తీసుకుని ఉదయగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసులు బ్యాగ్ తీసి లోపల చూస్తే యువకుడి చేయ్యి, కొడవలి ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఓరి దేవుడా ఏందిరా ఇది అని కదీర్ ను పోలీసులు ప్రశ్నించారు. సార్ ఇది మా బావ మోహమ్మద్ చెయ్యి, డెడ్ బాడీ గౌసియా నగర్ లోని మా బంధువల ఇంట్లో ఉందని చెప్పడంతో పోలీసులు మతిపోయింది.

 ఒక్కడు కాదు.... ముగ్గురు చంపేశారు

ఒక్కడు కాదు.... ముగ్గురు చంపేశారు

తన బావ మోహమ్మద్ ను నేను మాత్రమే హత్య చేశానని కదీర్ పోలీసులకు చెప్పాడు. అయితే భార్య తండ్రి అల్మద్ పాషా, అతని కొడుకులు కదీర్, అజ్మల్ పాషా కలిసి మోహమ్మద్ ను కాళ్లు, చేతులు నరికి చంపేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. భార్య అక్రమ సంబంధం విషయంలో పదేపదే గొడవ పడుతున్న మోహమ్మద్ హత్యకు గురైనాడని పోలీసులు అంటున్నారు. కదీర్ ను అరెస్టు చేశామని, తప్పించుకుని పారిపోయిన అతని తండ్రి అల్మద్ పాషా, అతని సోదరుడు అజ్మల్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వివాహం అయిన ఐదు నెలలకే బావమరదుల చేతిలో పెళ్లి కొడుకు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+