Horror: యువతి తల నరికి, అవయవాలు ముక్కలు చేసి కాకులు గద్దలకు వేసినట్లు నదిలో విసిరేశారు, ఏం చేసిందో ?

బెంగళూరు/ మైసూరు/ మండ్య: యువతి శరీరంలోని అవయవాలు కత్తిరించి, తల, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకు, గద్దలకు వేసినట్లు నదిలో విసిరేశారు. యువతి తల, శరీరంలోని అర్దభాగం నదిలో తేలడంతో యువతి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. యువతి శరీరంలోని ముక్కలు సేకరించిన పోలీసులు ఆమె సున్నితమైన అవయవాలు మాత్రం గుర్తించలేకపోయారు. అమ్మాయిని ఏమాత్రం గుర్తు పట్టుకుండా చేసి హత్య చేశారు. యువతి తల, శరీరంలోని కొన్ని ముక్కలను పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంత దారుణంగా హత్య చెయ్యడానికి ఆ అమ్మాయి ఏం చేసింది ?, ఆమె ఎవరు ? అనే విషయం అంతుచిక్కక పోలీసులు తలలు పట్టుకున్నారు.

 హేమావతి నదిలో యువతి తల

హేమావతి నదిలో యువతి తల

కర్ణాటకలోని మండ్య, మైసూరు జిల్లాలో హేమావతి నది ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా హేమావతి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. హేమావతి నదిలో యువతి తల తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు కేఆర్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో తేలుతూ అటూ ఇటూ వెలుతున్న యువతి తలను అతి కష్టం మీద బయటకు తీశారు.

 యువతి శరీరంలో అన్నిఅవయవాలు మాయం

యువతి శరీరంలో అన్నిఅవయవాలు మాయం

యువతి తల చిక్కిన కిలోమీటరు దూరంలో ఆమె శరీరంలోని మొండెం లభించింది. అయితే యువతి కాళ్లు చేతులు, వక్షోజాలు పూర్తిగా కత్తిరించడంతో పోలీసులు షాక్ కు గురైనారు. యువతి శరీరంలోని సున్నితమైన అవయవాలు మొత్తం కత్తిరించి యువతి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారని పోలీసులు గుర్తించారు.

 కాకులకు, గద్దలకు వేసినట్లు విసిరేశారు

కాకులకు, గద్దలకు వేసినట్లు విసిరేశారు

యువతి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన నిందితులు ఆమె అవయవాలను హేమావతి నదిలో కాకులకు, గద్దలకు అన్నం మెతుకులు విసిరేసినట్లు విసిరేయడంతో స్థానికులు, పోలీసులు హడలిపోయారు. సుమారు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువతిని దారుణ హత్యకు గురైయ్యిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Prabhas Movie Updates On The Way On The Occasion Of His Birthday | Oneindia Telugu
     ఏం పాపం చేసిందో ?

    ఏం పాపం చేసిందో ?

    హత్యకు గురైన యువతి అనవాళ్లు ఏమాత్రం చిక్కకుండా చేసిన నిందితులు ఆమె గురించి చిన్న క్లూ కూడా చిక్కకుండా చేశారని పోలీసులు అంటున్నారు. యువతి తలలో చెవులు, ముక్కుకూడా అర్దం కోసేశారని వెలుగు చూసింది. అయితే యువతి ముక్కులో చిన్న ముక్కుపుడక మాత్రం ఉందని పోలీసులు చెప్పారు. హత్యకు గురైన యువతి ఎవరు ? ఆమె ఏ ప్రాంతానికి చెందినది ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని పోలీసులు అంటున్నారు. 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యువతి ఎవరైనా కనపడటం లేదని ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందా ? అంటూ కేఆర్ పేట పోలీసులు ఆరా తీస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+