• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: నాలుగు నెలల క్రితం పెళ్లి, భర్తను ఏటైపులో చంపిందో తెలుసా ?, శవం కూడా కళ్లిపోయింది, కిలాడి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/పుదుక్కోటై: పెద్దల చూసిన సంబంధం చేసుకుంటే సుఖంగా ఉంటామని యువకుడు అన్నాకున్నాడు. అనుకున్న ముహూర్తానికి నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగిపోయింది. భార్య అత్తారింటిలో అడుగుపెట్టింది. అందంగా ఉన్న యువతి భార్యగా రావడంతో తాను జీవితాంతం సుఖంగా ఉంటానని యువకుడు మురిసిపోయాడు. అత్తారింటిలో అడుగుపెట్టినప్పటి నుంచి పెళ్లి కూతురు అదో టైపులో ప్రవర్తించడం మొదలు పెట్టింది. వివాహం జరిగి నాలుగు నెలలే అయినా పెళ్లి కూతురు ఇప్పటికే కొన్నిసార్లు పుట్టింటికి టూర్ వెళ్లి వచ్చేసింది. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చిన భర్త అతని భార్యను నిలదీశాడు. వివాహం జరిగి నాలుగు నెలలు కాకముందే ఇప్పటికే కొన్నిసార్లు పంచాయితీలు కూడా జరిగిపోయాయి. రెండు వారాల క్రితం భర్త మాయం కావడంతో అతని భార్య మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. నా కొడుకు కనపడటం లేదని నవవరుడు తల్లి కేసు పెట్టింది. పాడుపడిన బావిలో కుళ్లిపోయిన నవవరుడి శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అంతే నవవరుడిని అతని భార్య దారుణంగా చంపేసిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధులు హడలిపోయారు. పోలీసుల విచారణలో నా మొగుడిని ఎలా చంపానో అనే విషయాన్ని అతని భార్య సినిమా స్టోరీలాగా పూసగుచ్చినట్లు చెప్పడం కలకం రేపింది.

Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త, హోటల్ లో ఏసీ రూమ్ లో సెక్రటరీతో !Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త, హోటల్ లో ఏసీ రూమ్ లో సెక్రటరీతో !

 నాలుగు నెలల క్రితం పెళ్లి

నాలుగు నెలల క్రితం పెళ్లి

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని పెరుంగలూరు సమీపంలో పాండిదురై (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బోరాం గ్రామంలో నివాసం ఉంటున్న నందిని (23) అనే యువతితో పాండిదురై వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. అనుకున్న ముహూర్తానికి నాలుగు నెలల క్రితం పాండిదురై, నందిని పెళ్లి జరిగిపోయింది.

 భర్త అనుకున్నది ఒక్కటి..... జరిగింది ఒక్కటి

భర్త అనుకున్నది ఒక్కటి..... జరిగింది ఒక్కటి

పెద్దల చూసిన సంబంధంలోని నందినిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటామని పాండిదురై అన్నాకున్నాడు. పాండిదురై భార్య నందిని అత్తారింటిలో అడుగుపెట్టింది. అందంగా ఉన్న నందిని భార్యగా రావడంతో తాను జీవితాంతం సుఖంగా ఉంటానని పాండిదురై మురిసిపోయాడు. అత్తారింటిలో అడుగుపెట్టినప్పటి నుంచి పెళ్లి కూతురు నందిని అదో టైపులో ప్రవర్తించడం మొదలు పెట్టింది.

 పుట్టింటికి భార్య టూర్లు..... పెద్దలు పంచాయితీలు

పుట్టింటికి భార్య టూర్లు..... పెద్దలు పంచాయితీలు

పాండిదురై, నందిని వివాహం జరిగి నాలుగు నెలలే అయినా పెళ్లి కూతురు ఇప్పటికే కొన్నిసార్లు పుట్టింటికి టూర్ వెళ్లి వచ్చేసింది. భార్య నందిని ప్రవర్తన మీద అనుమానం వచ్చిన ఆమె భర్త పాండిదురై ఎందుకు పదేపదే పుట్టింటికి వెలుతాను అని అడుగుతున్నావు ? అంటూ అతని భార్యను నిలదీశాడు. వివాహం జరిగి నాలుగు నెలలు కాకముందే ఇప్పటికే కొన్నిసార్లు నందిని, పాండిదురై దంపతుల విషయంలో పంచాయితీలు చేసిచేసి విసిగిపోయారు.

 మాయం అయిపోయిన భర్త

మాయం అయిపోయిన భర్త

గత నెల 20వ తేదీన పాండిదురై, నందిని దంపతులు బయటకు వెళ్లారు. సాయంత్రం నందిని మాత్రమే ఇంటికి వచ్చింది. పాండిదురై ఎక్కడ అని అతని తల్లి మీనాక్షి కొడలు నందిని ప్రశ్నించింది. పనిమీద బయటకు వెలుతున్నానని చెప్పాడని, రాత్రి ఇంటికి వస్తానని చెప్పాడని నందిని చెప్పింది. నందిని మాత్రం సైలెంట్ గా ఇంటిలో ఉండిపోయింది.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

మరుసటి రోజు రాత్రి అయినా పాండిదురై ఇంటికి రాకపోవడంతో అతని తల్లి మీనాక్షి నా కొడుకు కనపడటం లేదని పోలీసు కేసు పెట్టింది. పోలీసులకు కూడా నందిని మీద అనుమానం వచ్చింది. భర్త పాండిదురై కనపడటం లేదని అందరూ కంగారుపడుతున్నా నందిని మాత్రం ఏమి పట్టనట్లు ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండటంతో పోలీసులకు ఇంకా అనుమానం పెరిగిపోయింది.

 కొడవలితో భర్తను నరికి చంపేసి బావిలో శవం వేసిరేసిన భార్య

కొడవలితో భర్తను నరికి చంపేసి బావిలో శవం వేసిరేసిన భార్య

పోలీసులు నందిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. గత నెల 20వ తేదీన తన భర్త పాండిదురై తనను బయటకు పిలుచుకుని వెళ్లి గొడవ పెట్టుకుంటున్నాడని నందిని పోలీసులకు చెప్పింది. తన మీద కోపంతో తన గొంతు నులిమి చంపేయడానికి తన భర్త పాండిదురై ప్రయత్నించాడని నందిని ఆరోపించింది. ఆ సమయంలో కోపం తట్టుకోలేక తానే కొడవలి తీసుకుని తన భర్త పాండిదురైని చంపేసి శవాన్ని పక్కనే ఉన్న పాడుపడిన బావిలోకి తోసేసానని నందిని అంగీకరించింది.

 నందిని దెబ్బతో బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

నందిని దెబ్బతో బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

పోలీసులు పాడుపడిన బావిలో కుళ్లిపోయిన నవవరుడు పాండిదురై శవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. నవవరుడు పాండిదురైని అతని భార్య నందిని అతి దారుణంగా చంపేసిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధులు హడలిపోయారు. పోలీసుల విచారణలో నా మొగుడు పాండిదురైని ఎలా చంపానో అనే విషయాన్ని అతని భార్య నందిని సినిమా స్టోరీలాగా పూసగుచ్చినట్లు చెప్పడం కలకం రేపింది. వివాహం చేసుకుని నాలుగు నెలలు కాకుండానే భర్త పాండిదురైని దారుణంగా హత్య చేసిన నందినికి తన భర్తను చంపాను అనే బాధ ఏమాత్రం లేకుండా ధీమాగా ఉందని, అసలు ఆమె మనుసులో ఏముందో తెలీయడం లేదని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. పెళ్లికి ముందు నందిని స్టోరీ ఏమిటి ? అనే విషయం గుర్తించి ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు బిజీ అయ్యారని తెలిసింది.

 నందిని వెనుక ఎవరైనా ఉన్నారా ?

నందిని వెనుక ఎవరైనా ఉన్నారా ?

అయితే పాండిదురైని అతని భార్య నందిని ఒక్కటే హత్య చేసిందా ?, పాండిదురైని హత్య చెయ్యడానికి ఆమెకు ఎవరైనా సహకరించారా ?, నందినికి ఏమైనా అక్రమ సంబంధం ఉందా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు అన్నారు. వివాహం జరిగిన నాలుగు నెలలకే భార్య నందిని చేతితో పాండిదురై దారుణ హత్యకు గురి కావడం పుదుక్కోటైతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Young woman: Wife killed her husband in a family dispute arrested in Pudukottai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X