hostels: లేడీస్ హాస్టల్స్, పీజీల్లో ఏం చేస్తున్నారంటే, హైటెక్, అమ్మాయిలు, ఆంటీలతో !
చెన్నై: ఉద్యోగాల కోసం సిటీకి వస్తున్న వారిని టార్గెట్ చేసుకుంటున్న ఓ ముఠా సభ్యులు మరోసారి రెచ్చిపోయారు. కుటుంబ సభ్యులను పోషించుకోవాలని అనుకున్న అమ్మాయిలు సిటీకి వచ్చారు. సరైన ఉద్యోగాలు చిక్కకపోవడంతో సరైన ఉద్యోగం కోసం అమ్మాయిలు వెతకడం మొదలుపెట్టారు. అలాంటి అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్న గ్యాంగ్ వారికి ఊహించని ఉద్యోగాలు ఇప్పించడంతో వారి జీవితాలు తల్లకిందులైనాయి. బయటకు వెళ్లి బతకలేక అందమైన అమ్మాయిలు వారి జీవితాలను ఏం చేశారంటే ?

ఉద్యోగాల కోసం అమ్మాయిలు ?
ఉద్యోగాలు వెతుక్కుంటూ చెన్నై సిటీకి వచ్చిన అమాయక మహిళలను కొందరు వ్యక్తులు టార్గెట్ చేస్తూ డబ్బు కోసం వారితో వ్యభిచారం చేస్తున్నారు. మంచి జీతంతో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఆదేశించారు.

అసలు మ్యాటర్ లీక్
ప్రత్యేక పోలీసు బలగాలు రహస్యంగా నిందితుల మీద నిఘా వేసింది. హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న నిందితుల మీద పోలీసులు నిఘా వేశారు. మొదట హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న బ్రోకర్లను అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులు అనుకున్నారు. ఈ కేసులో చెన్నై ఓఎంఆర్ రోడ్డులో మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వ్యభిచార నిరోధక విభాగం పోలీసు అధికారులకు సమాచారం అందింది.

లేడీస్ పీజీలు, లేడీస్ హాస్టల్స్ లో ?
కొన్ని లేడీస్ పీజీలు, కొన్ని లేడీస్ హాస్టల్స్ మీద పోలీసులు నిఘా వేశారు. రహస్య సమాచారం అందడంతో దురై పాక్కంలోని శక్తి నగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్‌ను తనిఖీ చేయగా అక్కడ మహిళలు సెక్స్ వర్క్‌లో నిమగ్నమై ఉన్నారని వెలుగు చూసింది. అనంతరం మహిళా కానిస్టేబుళ్లతో సహా పోలీసు బృందం సంబంధిత లేడీస్ ప్రైవేట్ పీజీలు, హాస్టల్‌పై దాడి చేసి సెక్స్ బ్రోకర్ల కోసం పోలీసులు వెతికారు.

మైండ్ బ్లాక్ స్కెచ్
ముత్తుమలై అమ్మన్ కోయిల్ వీధికి చెందిన గణేష్, తంజావూరుకు చెందిన రాజప్రతాప్, త్రిపురకు చెందిన అమీర్ బాబు అలియాస్ హలం, మోనీర్ హుస్సేన్ అనే నలుగురు నిందితులు అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని లేడీస్ హాస్టల్స్, పీజీల్లో నిందితులు హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని, ప్రతి లేడీస్ పీజీలు, హాస్టల్స్ లో సోదాలు చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి చెన్నై సిటీలో ఉద్యోగాలు చెయ్యడానికి వచ్చి వెలుతున్న అమ్మాయిను నిందితులు టార్గెట్ చేసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు .
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications