Viral Video: రైలు దొరుకుతుంది.. కానీ జీవితం మళ్లీ దొరకదు
దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాదిమంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే రైలులో సుదూర ప్రాంతాలకు వెళ్లొచ్చు. అందుకే భారత్ లో చాలామంది ఇతర వాహనాల కంటే రైలు ప్రయాణానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. అలాగే రైలు ప్రయాణం సౌకర్యవంతమైనదిగా ప్రయాణికులు భావిస్తుంటారు. రైలులో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారితోపాటు లోకల్, మెట్రో రైళ్లలోనూ నిత్యం వందలాదిమంది ప్రయాణిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధికోసం వెళ్లేవారు సమయానికి గమ్య స్థానం చేరుకోవాలంటే రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కారణంగా మెట్రోలో ప్రయాణించేందుకే చాలామంది ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
Calling this “Naari Shakti” or “Spirit of Mumbai” is actually dangerous messaging. A woman hanging outside a moving local is not empowerment. It is a serious safety risk, whatever the reason behind it. pic.twitter.com/57k7ShjjUh
— Mumbai Heritage (@mumbaiheritage) August 24, 2026
దేశ జనాభాకు సరిపడా రైళ్లు దేశంలో లేని కారణంగా ఏ రైలు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఇక పండగలు, సెలవుల సీజన్ అయితే అంతే సంగతులు.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేనంతగా రైలులోని బోగీలన్నీ ప్రయాణికులతో నిండిపోతుంటాయి. ఈ క్రమంలో చాలామంది రైలు డోర్ల అంచున నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. దాంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ముంబైలోని ఓ లోకల్ ట్రైన్ లో ఓ యువతి ప్రమాదకరంగా ప్రయాణించింది. కిటికి గ్రిల్స్ కు వేలాడుతూ యువతి ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ క్రమంలో ఆ యువతి ప్రయాణం చేస్తున్న సమయంలో రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న ఇనుప గ్రిల్స్ ఆమె తలకు అత్యంత దగ్గరికి రావడం తీవ్ర భయాందోళనకు గురి చేసేలా ఉంది. అత్యంత ప్రమాదకరంగా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇలాంటి ప్రయాణం చేసిన యువతిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయాణాలు అవసరమా..? కింద పడితే పరిస్థితి ఏంటి..? అని ఫైర్ అవుతున్నారు. ఏదైనా జరిగితే.. ఆ తర్వాత జరిగే నష్టం ఊహించలేనిది, రైలు దొరుకుతుందని.. కానీ జీవితం మళ్లీ దొరకదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ యువతి అలా ఎందుకు వెళ్లిందో కారణం తెలియకపోయినా.. రద్దీ కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనా సరే ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించడం సరికాదని సామాజిక మాధ్యమాల ద్వారా సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications