వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు రహిత చెల్లింపులకు.. ఇక మీ ‘వేలిముద్ర’ చాలు

ఇప్పుడు నగదు రహిత లావాదేవీలకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్ బ్యాంకింగ్.. ఈ బాదరబందీ లేనే లేదు. ఆధార్‌ ఆధారిత భీమ్‌ యాప్‌తో.. కేవలం మీ ‘వేలిముద్ర’తో మీ లావాదేవీ పూర్తవుతుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు ఇక డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు కూడా అవసరం లేదు. , పేటీఎం తరహా చెల్లింపులు, నెట్‌ బ్యాంకింగ్‌ లావా దేవీల జోలికి పోనవసరం లేదు. మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లడం, ఓటీపీ నెంబర్లు చూసుకోవడం, పిన్‌ నెంబర్లు, బ్యాంక్‌ ఖాతాల నెంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు.

అవును, మీరు చదివిందంతా నిజమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఆధార్‌ ఆధారిత భీమ్‌ యాప్‌తో ఇప్పుడు కేవలం మీ 'వేలిముద్ర'తో మీ లావాదేవీ పూర్తవుతుంది. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఈ యాప్‌ను మోడీ శుక్రవారం జాతికి అంకితం చేశారు.

finger print scanner

30 బ్యాంకుల్లో సేవలు...

ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 30 బ్యాంకులు భీమ్‌ యాప్‌ లావాదేవీల్లో పొల్గొంటున్నాయి. వీటిలో ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, దేనా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు ఉన్నాయి.

ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ వర్షన్లలో పనిచేసే భీమ్‌-ఆధార్‌ యాప్‌ను గత డిసెంబర్‌లోనే ప్రారంభించగా ఇప్పటి వరకు 1.9 కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే కార్పొరేట్‌ స్థాయి లావాదేవీలకు కాకుండా ప్రస్తుతానికి సాధారణ చెల్లింపులకు మాత్రమే ఈ యాప్ ను పరిమితం చేయనున్నారు.

ఏమిటీ ఈ యాప్ ప్రత్యేకత?

ఈ ఆధార్‌ ఆధారిత భీమ్‌ యాప్‌ బయో మెట్రిక్‌ విధానంతో నడుస్తుంది. ఆధార్‌ కోసం ఇప్పటికే అధికారులు మీ వేలి ముద్రలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అవే వేలిముద్రల ధ్రువీకరణ ద్వారా లావాదేవీలు కొనసాగుతాయి.

ఇప్పటికే దేశంలోని బ్యాంకులన్నింటినీ ఆధార్‌ కార్డులకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాలు అధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు మన బ్యాంక్‌ ఖాతాలను ఈ భీమ్‌ యాప్‌కు కూడా అనుసంధానం చేస్తున్నారు.

ఖాతాలో డబ్బులుంటే చాలు...

ఇక మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులుంటే చాలు. ఎక్కడైనా వేలి ముద్ర ధ్రువీకరణ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. వ్యాపారులు మాత్రం వేలి ముద్రలను స్కాన్‌ చేసే పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వినియోగదారుడు ఎంత చెల్లించాలో వాటిలో పేర్కొన్నాక.. వేలిముద్ర ఇస్తే చాలు. వేలి ముద్రను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాను గుర్తించి ఆ ఖాతాలోని ఆ సొమ్మును భీమ్‌ యాప్‌ వ్యాపారస్థుని ఖాతాలోకి బదిలీ చేస్తుంది.

English summary
Prime Minister Narendra Modi on Friday launched BHIM Aadhaar app for retailers and merchants which lets citizens make purchases without their smartphone or even credit/debit cards.The app authenticates a customer’s biometric details linked to his Aadhaar account through fingerprint scanner. The app can thus does away with the need to remember banking details such as PINs and make cashless transactions simpler and hassle-free. BHIM Aadhaar works on National Payments Council of India’s (NPCI’s) existing product -- Aadhaar Enabled Payment System (AePS). “This will directly cater to about 40 crore bank account customers spread across the country whose account is linked with Aadhaar. It is a huge opportunity for enabling digital transactions as about 99 percent of adult population is now Aadhaar-enabled,” said AP Hota, Managing Director and Chief Executive, NPCI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X