వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జకీర్ నాయక్ ప్రేరణతో 55 మంది ఉగ్రవాదులు!
ముంబై: వివాదాస్పద ముస్లీం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ వల్ల ప్రేరణ పొందిన ఉగ్రవాదులు 55 మంది వరకు ఉన్నారని దర్యాఫ్తు అధికారులు చెబుతున్నారు. వీరంతా సిమీ, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు.
జకీర్ నాయక్ నుంచి స్ఫూర్తి పొందామని వీరులో కొందరు, ప్రసంగాలు విన్నామని మరికొందరు వెల్లడిస్తున్నారు. వేర్వేరు చోట్ల వీరంతా అరెస్టయ్యారు. కొంతమంది 2005లో ్రెస్టు కాగా, మరికొందరిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది.

జకీర్ నాయక్ పైన చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశంపై దర్యాఫ్తు సంస్థలు ఈ సమాచారాన్ని రాబట్టాయని తెలుస్తోంది. నాయక్ బోధనలతో ప్రేరణ పొందిన వారిలో ఫిరోజ్ దేశ్‌ముఖ్, ఖతీల్ అహమద్ సిద్ధిఖీ, బిజూ సలీం, అఫ్షా జబీన్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.