మందుబాబులకు మరో గుడ్ న్యూస్, లిక్కర్ డెలివరీకి జొమాటో రెడీ..? ఇక ఇంటిముందుకే మందు..
మందుబాబులకు మరో తీపి కబురు. ఇప్పటికే వైన్ షాపులు తెరవడంతో చుక్క కోసం గంటల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫుడ్ డెలివరీ సంస్థ.. జొమాటో మద్యం డెలివరీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

సరుకులు..
జొమాటో ఇప్పటికే కిరాణా వస్తువులను కూడా అందజేస్తోంది. లాక్ డౌన్ వల్ల రెస్టారెంట్లు మూసివేయడంతో.. వినియోగదారులకు సరుకులు ఇస్తోంది. మార్చి 25వ తేదీన లాక్ డౌన్ అమలు కాగా.. లిక్కర్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే వైన్ షాపుల ముందు చాలా మంది నిల్చొవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. లిక్కర్‌పై ఢిల్లీ ప్రభుత్వం 70 శాతం సెస్ వేయగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఆన్ లైన్ డెలివరీ..
దేశంలో ప్రస్తుతం ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు చట్టపరమైన నిబంధణలు లేవు. కానీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్లూఏఐ) మాత్రం జొమాటో ఇతర సంస్థల ద్వారా విక్రయాలు జరిపించాలని అనుకుంటోంది. లిక్కర్ హోం డెలివరీ ద్వారా మందు వినియోగం బాధ్యతయుతంగా జరుగుతోందని జొమాటో భావిస్తోంది. ఐఎస్‌డబ్లూఏఐతో వ్యాపార ప్రతిపాదనలతో జొమాటో సీఈవో మోహిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.

25 ఏళ్ల వరకు..
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువతకు అనుమతి ఇస్తోంది. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో డెలివరీ చేసేందుకు జొమాటో సిద్దంగా ఉంది అని రాయిటర్స్ నివేదించింది. కానీ దీనిపై జొమాటో యాజమాన్యం మాత్రం స్పందించలేదు. లిక్కర్ డెలివరీ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతోందని ఐఎస్‌డబ్లూఏఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలో 27.2 బిలియన్ల లిక్కర్ కొనుగోలు జరుగుతోందని లండన్‌కు చెందిన ఐడబ్ల్యుఎస్ ఆర్ అంచనా వేసింది.
Recommended Video

ఈబర్ ఈట్స్ కొనుగోలు
చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ మద్దతుతో జొమాటో దేశలో విస్తరిస్తోంది. జనవరిలో ఉబెర్ ఈట్స్ కూడా కొనుగోలు చేసింది. జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ.. దీనికి చైనాకు చెందిన టెన్సెంట్ సపోర్ట్ చేస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications