ఒంటి మీద 11 లక్షల తేనెటీగలు: గిన్నీస్ రికార్డు (వీడియో)
చైనా: మనిషి సాహసిస్తే ఏమైనా చేస్తాడని ఈయన నిరూపించారు. గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఏకంగా 11 లక్షలకు పైగా తేనెటీగలను తన శరీరం మీద కుర్చోపెట్టుకున్నాడు. చూస్తేనే ఒళ్లు జలదరించే ఈ దృశ్యాలు చూసి గిన్నీస్ బుక్ నిర్వహకులు సైతం నోరు వెల్లబెట్టి చూశారు.

తేనెటీగలను చూస్తే మనిషి ఒలంపిక్స్ లో పరుగు పందెం గుర్తు తెచ్చుకుని పరుగు తీస్తాడు. అవి కుడితే అల్లాడిపోతాం. అయితే చైనాలోని గావో బింగువో (55) అనే ఆయన 11 లక్షలకు పైగా తేనెటీగలను తన శరీరం మీద పెట్టుకున్నాడు.
అవికుట్టినా ఓర్చుకున్నాడు. అంతటితో అతను ఆగలేదు. నోటిలో సిగరేట్ పెట్టుకుని వెలిగించాడు. 11 లక్షలకు పైగా ఉన్న తేనెటీగల బరువు 109 కేజీలు. గతంలో గిన్నీస్ బుక్ లో రికార్డుగా ఉన్న 85.5 కిలోల తేనెటీగల బరువును ఈయన బద్దలు కొట్టారు. సుమారు 35 సంవత్సరాల నుండి గావో బింగువో తేనె వ్యాపారం చేస్తున్నారు. ఈయనను ముద్దుగా తేనెటీగల రారాజు అని పిలుస్తారు.












Click it and Unblock the Notifications