చపాతీలు సరిగా చేయలేదని కూతుర్నే చంపేశారు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చపాతీలు సరిగా చేయలేదని కారణంతో ఓ 12ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు. నిందితులు ఆ బాలిక తండ్రి, సోదరుడే కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. షాద్‌బాగ్‌కు 12ఏళ్ల అనికా అనే బాలికను ఆమె సోదరుడు, తండ్రే హత్య చేశారు. ఏడవ తరగతి చదువుతున్న అనికా మృతదేహాన్ని లాహోర్‌లోని మాయో ఆస్పత్రి సమీపంలో పోలీసులు గుర్తించి, విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.

12-year-old girl tortured to death for not making proper Chapati

ఆస్పిత్రి సీసీ టీవీ ఫుటేజీ, సమీపంలోని ఇతర షాపుల సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, నిందితులు ఆమె తండ్రి, సోదరుడేనని తేల్చారు. ఆమెను హత్య చేసే ముందు చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.

పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తామే హత్య చేసినట్లు అంగీకరించారు. అనికాను తీవ్రంగా కొట్టి చంపినట్లు ఆమె తండ్రి, సోదరుడు ఒప్పుకున్నారు.

తాము తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిందని, ఆస్పత్రి తరలిస్తుండగానే అనికా మృతి చెందిందని చెప్పారు. దీంతో ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి సమీపంలోని నిర్జన ప్రదేశంలో పారేసి వెళ్లిపోయినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+