ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు: ఐక్యరాజ్యసమితి భద్రాతామండలిలో 13 దేశాలు వ్యతిరేకం..

ఇరాన్‌పై ఆంక్షలు నిరవధికంగా కొనసాగించాలని అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆంక్షలపై తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే 15 సభ్య దేశాల్లో 13 దేశాలు వ్యతిరేకించాయి. దీంతో అమెరికా ఒంటరిగా నిలిచిందని చెప్పాలి. దీంతో ఇప్పటివరకు కొనసాగిన ఆంక్షలు అమలు కావనే అర్థమవుతోంది.

2015లో ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం చేసుకుంది. అప్పుడు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. అమెరికా సహా రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ చమురు అమ్మడానికి, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేయడానికి అనుమతిచ్చారు. ఇరాన్‌ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ అలా వ్యవహరించడం లేదని 2018లో అమెరికా వైదొలిగింది. యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు కూడా బయటకు రావాలని కోరగా.. అందుకు అవీ అంగీకరించలేదు.

13 of 15-member UN Security Council oppose US push for Iran sanctions

ఇరాన్‌పై ఆంక్షలను కంటిన్యూ చేసేందుకు అమెరికా 30 రోజుల కౌంట్ డౌన్ కూడా విధించుకుంది. 2015లో అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకోసమే తాము కూటమి నుంచి వైదొలిగామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపే మరోసారి ఉద్ఘాటించారు. కానీ ఇరాన్‌పై ఆంక్షలను రష్యా, చైనా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆ రెండు దేశాలను మైక్ పాంపియో హెచ్చరికలు జారీచేశారు. భద్రతామండలిలో అమెరికా చేసిన తీర్మానానికి 15 దేశాల్లో 9 దేశాలు మద్దతు తెలపాలి.. కానీ 13 దేశాలు వ్యతిరేకంగా ఉండటంతో అమెరికా ఒంటరి అయిపోయింది.

Recommended Video

    Kamala Harris Appoints Indian American Sabrina Singh As Her Press Secretary || Oneindia Telugu

    2015 సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించి తీర్మానంపై 10 రోజుల్లో మిగతా ప్రతినిధులు ముందుకెళ్లాలి. లేదంటే 20 రోజుల్లో తీర్మానం ప్రవేశఫెట్టిన అధ్యక్షుడు ప్రతిపాదిస్తారు. సభ్య దేశాలు వ్యతిరేకంగా ఉంటే.. వీటో పవర్ అమెరికా ఉపయోగించవచ్చు. ఆంక్షలను వ్యతిరేకిస్తున్న రష్యా, చైనా ఏం చేస్తాయో చూడాలి మరీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+