Baltimore Bridge: అమెరికాలో షిప్ ఢీకొని కుప్పకూలిన 2.6 కిలోమీటర్ల బ్రిడ్జి..! వీడియో..
అమెరికాలో ఇవాళ తెల్లవారు జామున దుర్ఘటన చోటు చేసుకుంది. బాల్టిమోర్ నగరంలోని ఓ వంతెన హఠాత్తుగా కుప్పకూలింది. ఈ వంతెనను ఓ వాణిజ్య నౌక ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాల వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో చిమ్మ చీకట్లో ఓడ ఢీకొనగానే ఈ భారీ వంతెన కుప్పకూలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది వరకూ మృత్యువాత పడినట్లు ప్రాథమిక అంచనా.

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో వంతెన కుప్పకూలిన సమయంలో దానిపై ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే వంతెన కూలుతున్నప్పుడు మాత్రం నీటిలో వాహనాలు, జనం పడిపోతున్న దృశ్యాల్ని మాత్రం ప్రత్యక్ష సాక్ష్యులు చూశారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి అడుగుభాగాన్ని కంటైనర్ షిప్ ఢీకొట్టినట్లు అధికారులు గుర్తించారు. కింద ఉన్న పాలప్స్కో నదిలో ఈ వంతెన పడిపోయింది.
Baltimore Bridge is 1.6 miles long,
— Science girl (@gunsnrosesgirl3) March 26, 2024
this is the moment it collapsed after a cargo ship struck it in the early hours of this morning
pic.twitter.com/eA6womQlcI
మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పాతాప్‌స్కో నదిపై నిర్మించారు. ఇది పెద్ద కంటైనర్ షిప్‌తో ఢీకొనడంతో కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. అలాగే వంతెన ముక్కలు ముక్కలుగా నీటిలో పడిపోతున్నప్పుడు వాహనాలుగా కనిపించే వాటి నుండి లైట్లు రహదారి ఉపరితలంపై కనిపించాయి. బ్రిడ్జిలో మూడో ముక్క అయితే పడిపోయే ముందు పైకి లేవడం కూడా దృశ్యాల్లో కనిపించింది. దీంతో వంతెనపై ఉన్న ఓ ట్రాక్టర్ ట్రైలర్ తో పాటు పలు వాహనాలు పడిపోయినట్లు భావిస్తున్నారు.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications