ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
స్టాక్‌హోమ్: వివిధ రంగాల్లో పరిశోధనలకు ప్రతి ఏటా ప్రకటించే నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం నాడు ప్రారంభమైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. అమెరికాకు చెందిన ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారం ప్రకటించారు. జెఫ్రీ సి.హాల్, హైకెల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్‌కు ఈ నోబెల్ అవార్డు అందించనున్నట్టు నోబెల్ అవార్డుల కమిటీ ప్రకటించింది.
శరీరంలోని అణువులు మానవ జీవక్రియల, మానసిక ఉద్వేగాల మార్పులను ఏ విధంగా తమ అధీనంలో ఉంచుకుంటాయో వివరించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది.
మొక్కలు, జంతువులు, మనుషులు ప్రకృతిలో జరిగే మార్పులను తమలో ఎలా ఇముడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాయో వీరి పరిశోధనల్లో వివరించినట్టు స్వీడెన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఒక ప్రకటనలో పేర్కొంది.

నోబెల్ అవార్డు కింద విజేతలకు 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (11 మిలియన్ డాలర్లు) అందిస్తామని ప్రకటించింది. ఏటా వైద్యరంగంలో పరిశోధనలను గాను తొలుత నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు.
సైన్సు, సాహిత్యం, శాంతికి పాటుపడిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త, వాణిజ్యవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1901లో ఈ అవార్డులను ప్రారంభించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications