ఇంత ఘోరమా?: బ్రష్ చేసుకోలేదని.. చిన్నారి ప్రాణం తీసింది

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి.. కర్కశంగా ప్రవర్తించి తన నాలుగేళ్ల చిన్నారిని ప్రాణాలు తీసింది.

మేరీలాండ్: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి.. కర్కశంగా ప్రవర్తించి తన నాలుగేళ్ల చిన్నారిని ప్రాణాలు తీసింది. అది కూడా.. బ్రష్‌ చేసుకోలేదనే కారణంతో కావడం గమనార్హం. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మేరిల్యాండ్‌లో గల గైటర్స్‌ బర్గ్‌లో హెర్నాడ్జ్‌ రైవస్‌()20 తన కుమార్తె బాత్‌రూంలో అచేతనంగా పడిపోయిందని అత్యవసర సేవలకు నెంబర్‌ 911కు ఫోన్‌ చేసింది.

4-year-old girl dies after mother kicks her for not brushing her teeth

తన కుమార్తె స్నానం చేయటానికి బాత్‌రూంలోకి వెళ్లిన 15నిమిషాలకు పడిపోయి టబ్‌కు తలకొట్టుకుందని అధికారులను నమ్మించే ప్రయత్నం చేసింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఒంటిపై పలు గాయాలు ఉన్న విషయాన్ని గుర్తించారు.

తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండటంతో ది చిల్డ్రన్స్‌ నేషనల్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో పోలీసులు హెర్నాడ్జ్‌ను తమదైన శైలిలో విచారించగా నిజం బయటపెట్టింది.

బ్రష్ చేసుకోలేదనే కోపంతోనే తన కాలుతో చిన్నారి కడుపులో తన్నినట్లు ఒప్పుకుంది. దీంతో ఆ బాలిక గోడను కొట్టుకొని పడిపోయినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+