వైరల్ వీడియో: 40 సెకన్లపాటు ఆగకుండా అపానవాయువు.. ప్రపంచ రికార్డు బద్దలు..
చాలా రంగాల్లో రికార్డులు ఉంటాయి. విద్య, ఉద్యోగాలు, టాలెంట్, స్కిల్స్, ఫుడ్.. ఇలా ఒక్కటేమిటి అనేక రంగాల్లో పలు రికార్డులను బద్దలు కొడుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం అపానవాయువులో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 40 నిమిషాల పాటు ఆపకుండా అపానవాయువు వదిలి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అపానవాయువును వైద్యులు సహజమైన జీర్ణ ప్రక్రియగా భావిస్తుంటారు. అపానవాయువు వదిలేవాళ్ల జీర్ణ క్రియ సరిగ్గా ఉందని వైద్యలు సంకేతంగా చెబుతుంటారు. అయితే నలుగురిలో గ్యాస్ వదలాలంటే అనేకమంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే గ్యాస్ వదలడంలోనూ రికార్డును నెలకొల్పాడు ఓ వ్యక్తి. 40 సెకన్లపాటు ఏకధాటిగా ఆగకుండా అపానవాయువును మైక్ ముందు వదిలాడు. ఆ సౌండ్స్ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అతడి శరీరంలో వన్ టీబీ ఫ్రీ స్పేస్ ఉందని.. మా ఇంట్లో రోజూ ఇలాంటి రికార్డులు బద్దలవుతుంటాయని.. ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంప్రెసివ్, ఇన్ స్పిరేషనల్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుత ఇంటర్నెట్ కాలం కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు, వార్తలు, వింతలు, విశేషాలు జరిగినా అవి ప్రపంచం ముందుకు చేరుతున్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మానవులు తమ టాలెంట్ ను రకరకాలుగా ప్రపంచం ముందు నిరూపించుకుంటున్నారని వివరిస్తున్నారు. ఇలాంటి వాటికి కూడా గిన్నిస్ రికార్డులు పెట్టి సగటు ఔత్సాహికులను ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. అయితే ఈ పోటీలు ఎక్కడ నిర్వహించారు. ఏ దేశంలో జరిగింది అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఈ వీడియో మాత్రం నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలామంది ఈ వీడియోను సమర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications