పశ్చిమ పనామాలో భారీ భూకంపం, 6.7 తీవ్రతతో ప్రకంపనాలు
పశ్చిమ పనామాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.7గా ఉంది. భూ ప్రకంపనాలతో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. వెరగ్వాస్‌లో గల బొకస్ డెల్ టొరొలో గల హెర్రెస్ వద్ద భూకంపం వచ్చింది.

6.2 మైల్స్ (10 కిలోమీటర్ల) లోతు వరకు భూకంపం ప్రభావం చూపించిందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొంది. బొకా చికాకు సౌత్- సౌత్ వెస్ట్ 62 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపింది. పశ్చిమ తీరంలో భూకంపం ప్రభావం చూపించిందని పేర్కొంది. భూకంపంతో సునామీ హెచ్చరికలు ఏమీ జారీచేయలేదు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఏమీ చేయలేదు.












Click it and Unblock the Notifications