19 మంది అమ్మాయిలపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

బీజింగ్: చైనాలో 19 మంది పాఠశాల అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించిన 60 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో బాలల పట్ల జరుగుతున్న అకృత్యాల్లో ఇది అత్యంత దారుణమైన సంఘటనగా చెబుతున్నారు.

ఝౌ జియాన్మిన్ పదవీ విరమణ చేసే దశలో ఉన్నాడు. 19 మంది అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించినట్లు అతను అంగీకరించాడని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మధ్య చైనాలోని హునాన్ ప్రొవిన్స్ యియాంగ్ సిటీ హెషాన్ జిల్లా టౌన్‌షిప్ స్కూల్లో అతను మూడు, నాలుగు గ్రేడ్ల విద్యార్థలకు సైన్స్ పాఠాలు చెబుతాడు.

60-year-old Chinese teacher detained for molesting 19 girls

పాఠశాల ప్రిన్సిపాల్ జెంగ్ జిన్యుయెను డిస్మిస్ చేసినట్లు జిల్లా ఎడ్యుకేషన్ బ్యూరో తెలిపింది. ఇప్పటి వరకు 8 నుంచి 11 ఏళ్ల వయస్సు గల 26 మంది పిల్లలకు బాడీ చెక్స్ చేశారు. వారిలో ఇద్దరు జననాంగాలకు సంబంధించిన మంటతో బాధపడుతున్నారు.

బాధిత విద్యార్థలుల కోసం సైకాలిజికల్ కన్సల్టేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం నడిపే జిన్హా న్యూ ఏజెన్సీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థులు హింసకు గురవుతున్న సంఘటనలు చైనాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. సెంట్రల్ హుబేలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యుయుడు సెప్టెంబర్ పలువురు అమ్మాయిలపై అత్యాచారం చేసిన సంఘటన వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+