అమెరికాలో కాల్పుల కలకలం: వేర్వేరు ఘటనల్లో 10 మంది మృతి, నిందితుడి కాల్చివేత

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

కాగా, పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలోనే అక్కడికి ప్రవేశించిన నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

7 adults dead after birthday party shooting in Colorado in US: 3 killed in woodland firing

మరోవైపు వుడ్‌ల్యాండ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇరుగుపొరుగున ఉండేవారిపై కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పులు జరుపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వారి ఇళ్లల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. వెంటనే ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు అతడ్ని మట్టుబెట్టారు. అమెరికాలు తరచూ ఇలాంటి కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+