అమెరికాలో అయిదుమంది తెలుగు యువకులు అరెస్ట్: యాంటీ ప్రాస్టిట్యూషన్ ఆపరేషన్
Texas Police: అమెరికాలో వ్యభిచార కేసులో 21 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ఏడుమంది భారతీయులు ఉన్నారు. వారిలో అయిదుమంది తెలుగు వాళ్లే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిపై అమెరికా నేర, వ్యభిచార నిరోధక చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.
వ్యభిచారం పెరిగిపోయిందనే కారణంతో టెక్సాస్ స్టేట్‌లోని డెంటన్ కంట్రీ పోలీసులు ప్రత్యేకంగా యాంటీ ప్రాస్టిట్యూషన్ ఆపరేషన్‌ను చేపట్టారు. 48 గంటల పాటు కొనసాగిందీ ఆపరేషన్. ఈ నెల 14, 15 తేదీల్లో వివిధ ప్రాంతాలపై హైల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆకస్మిక దాడులు చేశారు.

ఈ సందర్భంగా మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 14 మందిని సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ కింద కేసులు నమోదు చేసినట్లు డెంటన్ డివిజినల్ పోలీస్ అధికారి ట్రేసీ మర్ఫీ వెల్లడించారు. వారి ఫొటోలు, పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.
అమెరికా చట్టాల ప్రకారం వారికి స్టేట్ జైలు శిక్ష పడుతుంది. నిందితుల్లో ఇద్దరి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉందని, దీన్ని సెకెండ్ డిగ్రీ ఫెలోనీగా గుర్తించినట్లు చెప్పారు.
అరెస్టయిన వారిలో మొత్తం ఏడుమంది భారతీయులు ఉన్నారు. వారిలో బండి నిఖిల్- డెంటన్, గల్లా మోనిష్- టెక్సాస్, కుమ్మరి నిఖిల్- డెంటన్, మేకల జైకిరణ్ రెడ్డి- డెంటన్, రాయపాటి కార్తీక్- డెంటన్ ఉన్నారు. ఈ అయిదుమందీ తెలుగు వాళ్లేనని చెబుతున్నారు. నబీన్ శ్రేష్ట- టెక్సాస్, అమిత్ కుమార్- టెక్సాస్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.
**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ
— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024
బ్రాడ్లే జేసన్ బ్రూస్ కెల్లర్- టెక్సాస్, క్యునెయొ మోవిన్‌స్కీ- టెక్సాస్, ఇలియట్ ఆంథొని ఛార్లెస్ బోవీ- టెక్సాస్, ఫ్యునెట్ హెర్నాండెజ్ లూయిస్ కోరింత్- టెక్సాస్, ఆరోన్ రస్సెల్ కెన్సో- డెంటన్, మొరెనో క్యాస్ట్రో ఫెర్నాండో- టెక్సాస్, నీల్లి బ్యారీ డాన్- టెక్సాస్, , రుబియో వర్గాస్- టెక్సాస్, రాబర్ట్ ఆండ్రూ- టెక్సాస్, జెఫ్రీ ఆంటోనియో- టెక్సాస్, విలియమ్స్ ప్యారిస్ లామోంట్- టెక్సాస్ ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications