వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ ఇయర్ వేడుకలో విషాదం -కాటేజీలో హీటర్ నుంచి పాయిజన్ గ్యాస్ -8 మంది మృతివాళ్లంతా స్కూల్, కాలేజీ విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

వాళ్లంతా స్కూల్, కాలేజీ విద్యార్థులు. మొత్తం ఎనిమిది మంది. వయసు 18 నుంచి 20 ఏళ్లలోపే. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు కలిసి న్యూ ఇయర్ పార్టీ ప్లాన్ చేసుకున్నారు. సిటీకి దూరంగా చక్కటి కాటేజీలో చిందులేస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పలకాలనుకున్నారు. కానీ ఆ పార్టీ కాస్తా పెను విషాదంగా మారింది. కాటేజీలో గ్యాస్ పాయిజన్ చోటుచేసుకోవడంతో మొత్తం ఎనిమిది మందీ మృత్యువాతపడ్డారు.

న్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతోన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

దక్షిణ యూరప్‌లోని బోస్నియా దేశంలో గురువారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రాజధాని సారాజేవోకు 90 కిలోమీటర్ల దూరంలోని ట్రిబిటోవో గ్రామంలోని అడవిలో హాలిడే కాటేజీలో న్యూఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లిన యువత అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర చలి కారణంగా వెచ్చదనం కాటేజీలోని హీటర్ జనరేటర్‌‌ను ఆన్ చేసి వారంతా సరదాలో మునిగిపోగా..

 8 die in New Years Eve carbon monoxide poisoning in Bosnia

జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకైంది. ఆ విష వాయువును పీల్చిన కొద్ది క్షణాల్లోనే 8 మందీ విగతజీవులైపోయారు. తెల్లారిన తర్వాత పనివాళ్లు అక్కడికెళ్లి చూసి షాక్ తిని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలిన్ని పరిశీలించిన పోలీసుల బృందాలు.. విష వాయువు ( కార్బన్‌ మోనాక్సైడ్‌ ) కారణంగానే మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు.

బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబుబీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు

కొత్త ఏడాది తొలిరోజే ఎనిమిది మంది యువత చనిపోవడంతో వారికి సంతాప సూచకంగా ఆ గ్రామంలోని దుకాణాలను యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ వాసన, రంగు, రుచి లేని వాయువు. ఈ వాయువును పీల్చిన వారు వెంటనే అనారోగ్యానికి గురై మృతి చెందే అవకాశముంది. అందుకే హీటర్, కూలర్ జనరేటర్లను ఇండ్ల లోపల కాకుండా బయటే ఉంచుతారు.

English summary
Eight young men and women have died in a cottage in southwest Bosnia, apparently from carbon monoxide poisoning during a New Year's Eve celebration, police said Friday. Local police spokeswoman Martina Medic told The Associated Press that police responded to a call around 10 a.m. and went to a house in Tribistovo where several people were found dead. The village is 150 kilometers (90) southwest of Sarajevo, the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X