అమెరికాకు 88 దేశాలు బిగ్ షాక్.. అయోమయంలో ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) అనే నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అలా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలపై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) లో భాగంగా దేశంలోని వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించి స్వదేశాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాల మోత మోగించారు. ఈ క్రమంలో ట్రంప్ దుందుడుకు వ్యక్తిత్వంతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారినట్లు తెలుస్తోంది.
88 countries suspend postal service with the US. Customs duties. Trade war and de minimis shipments. Hits e-commerce and small shipments for manufacturing and retail. A big deal for many supply chains. https://t.co/Qb4CJvyMt1
— Tom Craig (@LTDManagement) September 6, 2025
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అమెరికాకు ఆయా దేశాలు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో భారత్ తో పాటు ఇప్పటివరకూ 25 దేశాలు చేరాయి. అలా 88 పోస్టల్ ఆపరేటర్లు పూర్తిగా లేదా పాక్షికంగా సేవలు నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది. ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయంతో అమెరికా పోస్టల్ ట్రాఫిక్ 80 శాతం తగ్గిపోయినట్లు స్పష్టం అవుతోంది.
వివిధ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపును ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ఈ ఏడాది జులై చివర్లో ప్రకటించింది. ఆగస్టు 29 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో అంతర్జాతీయ మెయిల్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే దాదాపు 88 పోస్టల్ ఆపరేటర్లు పూర్తిగా లేదా పాక్షికంగా సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. దీంతో ఆగస్టు 29కు ముందు వారంతో పోలిస్తే అమెరికాకు పోస్టల్ ట్రాఫిక్ 81 శాతం తగ్గినట్లు సమాచారం అందుతోంది. తిరిగి ఎప్పటిలోగా ఈ సేవలు మొదలవుతాయనే విషయంపై స్పష్టత ఇంకా రాలేదు.

ఇక భారత్ పైనా 50 శాతం సుంకాలు విధించారు ట్రంప్. ఈ సుంకాలు ఆగస్టు 27నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం.












Click it and Unblock the Notifications