US vS China: అమెరికా నిఘా విమానాన్ని వెంటాడిన చైనా ఫైటర్ జెట్..
డ్రాగన్ దేశం చైనా సముద్రంపై దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కొద్ది రోజల క్రితం అమెరికా నిఘా విమానాన్ని చైనా ఫైటర్ జెట్ వెంబడించినట్లు అమెరికా పేర్కొంది. పారాసెల్ ద్వీపానికి 30 మైళ్ల దూరంలో దక్షిణ చైనా సముద్రం మీదుగా 21,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న US నేవీ జెట్‌ను గగనతలానికి ప్రయోగించే క్షిపణిలు కలిగి ఉన్న చైనా ఫైటర్ జెట్ వెంబడించిందని వివరించింది.
చైనీస్ జెట్ చాలా దగ్గరగా వచ్చిందని తెలిపింది. నిఘా విమానం ఫైలట్లు ఫైటర్ జెట్ వైపు చూడగా.. తోక రెక్కలపై ఎర్రటి నక్షత్రం, అది ఆయుధాలతో విమానంగా ఉన్నట్లు గుర్తించారని పేర్కొంది. పరాసల్ ద్వీప సమూహం వద్దకు వచ్చేసరికి విమాన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఓ గొంతు వినిపించిందని.. చైనా విమానాశ్రయం నుంచి అది వెలువడింది యూఎస్ తెలిపింది.

తమ విమానం చైనా గగనతలానికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని ఆ సమయంలో "ఇక ముందుకు రావద్దు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే జరిగే దానికి మీదే బాధ్యత" అని హెచ్చరికలు వినిపించాయని తెలిపింది. ఈ నిఘా విమానంలో అమెరికా మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. వారికి కూడా ఆ రేడియో హెచ్చరిక స్పష్టంగా వినిపించింది. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఈ నిఘా విమానం ఎడమ రెక్కకు 500 వందల అడుగుల దూరంలో ఓ చైనా ఫైటర్ జెట్ ప్రత్యక్షమైనట్లు అమెరికా మీడియాలో కథనలు వచ్చాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనా జెట్ ఫైటర్లు వెంబడించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలా జరిగింది.












Click it and Unblock the Notifications