model: ఫేమస్ మోడల్ కాళ్లు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టారు, తల, మొండెం, చేతులు మిస్సింగ్, మాజీ మొగుడు ?

దేశంలోనే ఓ మోడల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కనపడకుండా పోయిన ఆ మోడల్ రెండు కాళ్లు ఓ ఫ్రిడ్జ్ లో కనపడటం కలకలం రేపింది. మోడల్ తల, చేతులు, మొండెం మాయం అయ్యాయి.

హాంకాంగ్/చైనా: తక్కువ వయసులోనే తన అందచందాలతో ఓ మోడల్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ కంపెనీలకు, మ్యాగ్జైన్లకు ఆ మోడల్ పని చేసింది. దేశంలోనే ఆ మోడల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కనపడకుండా పోయిన ఆ మోడల్ రెండు కాళ్లు ఓ ఫ్రిడ్జ్ లో కనపడటం కలకలం రేపింది. మోడల్ తల, చేతులు, మొండెం కనపడకపోవడంతో పోలీసులు హడలిపోయారు. ప్రముఖ మోడల్ దారుణ హత్యకు గురైయ్యిందని నిర్దారించిన పోలీసులు ఆమె మాజీ భర్తతో పాటు ముగ్గురిని పట్టుకున్నారు.

చైనాలో చాలా ఫేమస్ మోడల్

చైనాలో చాలా ఫేమస్ మోడల్


ఓ ప్రముఖ మోడల్ చైనాలలో ఆమె అందాలు ఆరబోసి చాలా పాపులర్ అయ్యింది. మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆమోడల్ దారుణ హత్యకు గురైందని వెలుగు చూడటంతో ఆమె అభిమానులు బిత్తరపోయారు. హాంకాంగ్‌ లో నివాసం ఉంటున్న ప్రముఖ మోడల్ ఏబీ చోయ్ (28) అనే యువతి హత్యకు గురైయ్యిందని హాంకాంగ్ పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. మోడల్ ఏబి చోయ్ హత్యతో ఆదేశంలోని సాటి మోడల్స్ హడలిపోతున్నారు.

ఫ్రిడ్జ్ లో మోడల్ కాళ్లు

ఫ్రిడ్జ్ లో మోడల్ కాళ్లు

మోడల్ ఏబి చోయ్ శరీరంలోని కాళ్లు ఫ్రిజ్‌లో లభ్యం కావడంతో ఆమె హత్యకు గురైన వియం వెలుగు చూసింది. కొద్దిరోజులుగా ఏబి చోయ్ కనిపించకుండా పోయిందనే చైనాలో వార్తలు ప్రచారంలోకి వచ్చింది. మోడల్ ఏబి చోయ్ కోసం హాంకాంగ్ పోలీసులు గాలించారు. ఓ అద్దె ఇంటిలోని ఫ్రిడ్జ్ లో మోడల్ ఏబి చోయ్ కాళ్లు లభ్యం కావడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

 మోడల్ తల, మొండెం, చేతులు ఎక్కడ ?

మోడల్ తల, మొండెం, చేతులు ఎక్కడ ?

మోడల్ ఏబి చోయ్ తెగిపోయిన కాళ్లు ఫ్రిజ్‌లో కనిపించడంతో ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసులు నిర్దారించారు. మోడల్ ఏబి చోయ్ హత్య కేసులో హాంకాంగ్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 28 ఏళ్ల మోడల్ ఏబి చోయ్ మృతదేహం ముక్కలు చెయ్యడానికి ఉపయోగిమంచిన మాంసం స్లైసర్, ఎలక్ట్రిక్ రంపం, పొడవాటి రెయిన్‌కోట్లు, చేతి గ్లౌజ్ లు, మాస్క్‌లు తై పో జిల్లాలోని అద్దె ఇంట్లో లభించాయని హాంకాంగ్ పోలీసు అధికారులు తెలిపారు. అయితే మోడల్ ఏబి చోయ్ తల, మొండెం, చేతులు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.

చివరిసారి సీసీటీవీల్లో ?

చివరిసారి సీసీటీవీల్లో ?

గత మంగళవారం కనిపించకుండా పోయిన మోడల్ ఏబి చోయ్ మొనాకో మ్యాగజైన్ తాజా ఎడిషన్ ముఖచిత్రంపై చివరిసారిగా ఫోజులు ఇచ్చింది. డ్రోన్‌లు, ప్రత్యేక బృందాలతో మోడల్ చోయ్ శరీరంలోని మిగిలిన భాగాల కోసం శోధిస్తున్నామని, ఆమె హత్యకు కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని హాంకాంగ్ పోలీసులు అంటున్నారు. మోడల్ ఏబి చోయ్ చివరిసారి తాయ్ పో జిల్లాలోని కొన్ని సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని అధికారులు ఆధారాలు సేకరించారు.

మోడల్ మాజీ మొగుడు ?

మోడల్ మాజీ మొగుడు ?

మోడల్ ఏబి చోయ్ హత్యకు గురైన తరువాత ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. చోయ్ మాజీ భర్త అలెక్స్ తో పాటు అతని సోదరుడు, తండ్రి, తల్లిని కూడా అరెస్ట్ చేశారని చైనా మీడియా అంటోంది. చైనాలో ప్రముఖ మోడల్ చోయ్ హత్యకు గురి కావడం ఆ దేశంలో కలకలం రేపింది. గత ఏడాది మేలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యకు, ఇప్పుడు చైనాలో జరిగిన మోడల్ హత్యకు చాలా దగ్గర పోలికలు ఉండటం హాట్ టాపిక్ అయ్యింది,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+