ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న కూతురిని చూసిన తండ్రి ఏం చేశాడంటే, కొడుకులు?
లాహోర్/పాకిస్తాన్: పెళ్లి వయసు వచ్చిన కూతుర్లు ఇద్దరు ఇంట్లో ఉన్నారు యువతులకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఓ యువతి ఆమె ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏరియాలో ఉండే యువకుడిని ప్రేమించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఆ యువతి ఆమె ప్రియుడితో కలిసి బయట తిరగడం మొదలుపెట్టింది. మ్యాటర్ యువతి ఇంట్లో తెలిసిపోవడంతో మొత్తం రివర్స్ అయ్యింది.
దాయాది దేశం పాకిస్తాన్ లో ఎలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ రాజధాని లాహోర్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో జాంగ్ జిల్లాలోని గర్ హరాజ్ ఏరియాలో రజబ్ ఆలీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రజబ్ ఆలీకి జబ్బార్ ఆలీ, అమీర్ ఆలీ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రజబ్ ఆలీకి మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. రజబ్ ఆలీ పెద్ద కుమార్తెకు 20 ఏళ్ల వయసు ఉంది. పెళ్లి వయసుకు వస్తున్న రజబ్ ఆలీ కుమార్తె అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించింది. తండ్రితో పాటు ఇద్దరు సోదరులు ఇంట్లో లేని సమయంలో బయటకు వెలుతున్న యువతి ఆమె ప్రియుడితో కలిసి హ్యాపీగా తిరగడం మొదలుపెట్టింది.
ఇటీవల కుమార్తె లవ్ మ్యాటర్ తెలుసుకున్న రజబ్ ఆలీ రగిలిపోయాడు. నువ్వు ప్రేమించిన యువకుడిని ఇక ముందు కలవకూడదని కుమార్తెను హెచ్చరించాడు. తండ్రి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ యువతి ఆమె ప్రియుడిని మరిచిపోలేక అతన్ని సీక్రేట్ గా కలవడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో కూతురి మీద రజబ్ ఆలీ పగ పెంచుకున్నాడు.
కుతురికి బుద్దిమాటలు చెప్పినా కూడా పద్దతి మార్చుకోలేదని, అందరికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని రజబ్ ఆలీ రగిలిపోయాడు. రజబ్ఆలీ, అతని కుమారుడు జబ్బార్ ఆలీ, అమీర్ ఆలీ కలిసి ప్రేమించిన యువతిని తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తరువాత యువతి మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశారు.
తీవ్రగాయాలైన యువతిని రక్షించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ప్రేమించాను అనే కోపంతో తన తండ్రితో పాటు ఇద్దరు సోదరులు తనకు నిప్పు అంటించారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిన యువతి తరువాత చనిపోయిందని పోలీసు అధికారులు అన్నారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications