Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు..

ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతాల్లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో వచ్చింది. భూకంపం కేంద్రం.. సముద్రం కింద 147 కిలోమీటర్లు (91 మైళ్లు), గోరంటాలోకు దక్షిణ ఆగ్నేయంగా 65 కిలోమీటర్లు (40 మైళ్లు) దూరంలో కేంద్రీకృతమైందని US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది గోరంటాలో, ఉత్తర సులవేసి, ఉత్తర మలుకు, సెంట్రల్ సులవేసి ప్రావిన్సులలోని కొన్ని ప్రాంతాలను కంపించింది.

సునామీ హెచ్చరికలు

సునామీ హెచ్చరికలు

ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ మరియు జియోఫిజిక్స్ ఏజెన్సీ ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియా, విస్తారమైన ద్వీపసమూహంగా ఉంది. ఈ దేసంలో 270 మిలియన్ల మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఈ దేశం పసిఫిక్ బేసిన్ చుట్టూ భూకంప లోపాలతో కూడిన "రింగ్ ఆఫ్ ఫైర్" పై దాని స్థానం కారణంగా తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు గురవుతుంది.

పశ్చిమ జావాలో

పశ్చిమ జావాలో

నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 331 మంది మరణించారు. సులవేసిలో 2018 భూకంపం, సునామీ కారణంగా 4,340 మంది మరణించిన తర్వాత ఇండోనేషియాలో ఇది అత్యంత ఘోరమైనది. 2004లో, అత్యంత శక్తివంతమైన హిందూ మహాసముద్ర భూకంపం ఒక డజను దేశాల్లో 230,000 మందికి పైగా మరణించిన సునామీని సృష్టించింది, వారిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌లో ఉన్నారు.

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త

తాజాగా వచ్చిన భూకంపంలో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని పేర్కొంది. ఇండోనేషియాలో భూకంపాలు కామన్ కాబట్టి అక్కడ ప్రజలు ఎప్పుడు అప్రమత్తతో ఉంటారు. అందుకే అక్కడ ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+