అమెరికాలో కుప్పకూలిన మరో విమానం: మూడు రోజుల్లో రెండోసారి

Donald Trump: అమెరికాలో మొన్నటికి మొన్న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల రొనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై ఈ దుర్ఘటన సంభవించింది. దీనిపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.

64 మంది ప్రయాణికులతో కూడిన ఫ్లైట్.. అమెరికా సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను గాల్లోనే ఢీ కొట్టింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో ల్యాండ్ అవుతోన్న హెలికాప్టర్‌ను ఢీ కొట్టిందీ పాసింజర్ ఫ్లైట్.

A medical transport jet carrying 6 crashed in Philadelphia

ఢీ కొట్టిన వెంటనే రెండూ గాల్లోనే ముక్కలయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి. నిప్పులు చిమ్ముతూ కుప్పకూలిపోయాయి. విమానం, హెలికాప్టర్ శకలాలు ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయి. పొటొమాక్ రివర్‌లో చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి తేరుకోక ముందే మరో విమాన ప్రమాదం చోటు చేసుకుందక్కడ. ఫిలడెల్ఫియాలో ఓ జెట్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జనావాసాలు, షాపింగ్ మాల్‌పై కూలడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు.

లియర్‌జెట్ 55కు చెందిన మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానం అది. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:06 నిమిషాలకు నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది. 1,600 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ తరువాత కొన్ని సెకెండ్లల్లోనే ప్రమాదానికి గురైంది. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది.

ఫిలడెల్ఫియా రాన్ హర్ట్స్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న రూజ్‌వెల్ట్ షాపింగ్ మాల్, ఇతర జనావాసాలపై ఈ జెట్ శకలాలు పడ్డాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఫ్లైట్ మొత్త దగ్ధమైంది. మంటలు జనావాసాలకూ వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+