సెక్స్ బానిసగా అమ్మేందుకే..: మోడల్ కిడ్నాప్ వెనుక సంచలన విషయాలు..

ఫేక్ ఫోటోషూట్‌తో బ్రిటీష్ మోడల్ అయిలింగ్‌కు వలవేసి ఆమెను కిడ్నాప్ చేశారని ఇటలీ పోలీసులు తాజాగా వెల్లడించారు. గతేడాది వేసవిలో కిడ్నాప్‌కు గురైన అయిలింగ్ ను నిందితులు మానసికంగా శారీరకంగా తీవ్ర ఇబ్బందుల పాలుచేశారని చెప్పారు. 20 ఏళ్ల క్లోహి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన లుకాస్‌ పవాల్‌ హెర్బాను పోలీసులు విచారించగా.. దారుణమైన విషయాలు వెలుగుచూశాయి.

 సెక్స్ బానిసగా..:

సెక్స్ బానిసగా..:

ఆన్‌లైన్‌లో ఓ డార్క్ వెబ్‌సైట్‌కు ఆమెను సెక్స్ బానిసగా అమ్మేయాలని నిందితులు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంగ్లండ్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న హెర్బా (30 ).. ఇటలీ లోని మిలాన్‌లో ఫొటోషూట్‌ పేరుతో అయిలింగ్‌కు వలవేశాడు. అదంతా ఫేక్ అని తెలియని అయిలింగ్ అతని ట్రాప్‌లో చిక్కుకుపోయింది.

ఇటలీలో కిడ్రాప్..:

ఇటలీలో కిడ్రాప్..:

ఫోటోషూట్ కోసం అయిలింగ్ ఇటలీలోని మిలాన్ లో హోర్బా చెప్పిన చోటుకు వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక గానీ ఆమెకు అసలు విషయం తెలియలేదు. అక్కడికెళ్లాక ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులు.. కాళ్లు, చేతులు కట్టిపడేసి ఆమెనో సూట్ కేసులో కుక్కేశారు.

 డార్క్‌ వెబ్‌ సైట్‌ కోసం బేరసారాలు..:

డార్క్‌ వెబ్‌ సైట్‌ కోసం బేరసారాలు..:

ఇంటర్నెట్‌లో ఒక డార్క్‌ వెబ్‌ సైట్‌లో అయిలింగ్‌ను సెక్స్‌ బానిసగా అమ్మేయడానికి కిడ్నాపర్లు బేరసారాలు సాగించినట్టుగా అయిలింగ్ పోలీసులకు వెల్లడించారు. ఇందుకోసం మూడు లక్షల డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.

కాళ్లు చేతులు కట్టేసి:

కాళ్లు చేతులు కట్టేసి:

కిడ్నాప్ తర్వాత తననో సూట్ కేసులో కట్టిపడేశారని, కారు డిక్కీలో పడేసి టురిన్ శివార్లలో ఉన్న ఒక ఫామ్‌హౌజ్‌కు తరలించారని అయిలింగ్ చెప్పారు. అక్కడ కుర్చీకి కాళ్లు చేతులు కట్టేసి బంధించారని, కొన్ని రోజుల వరకు అదే కుర్చీలో గడిపానని ఆమె వెల్లడించారు.

 అమ్మాయిల అక్రమ రవాణా:

అమ్మాయిల అక్రమ రవాణా:

మోడల్ అయిలింగ్ రెండేళ్ల బాబుకు తల్లి అని తెలియడంతో దుండగులు ఆమెను గతేడాది జులైలో మిలాన్‌లోని బ్రిటిష్‌ కాన్సులేట్‌ వద్ద వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత నిందితుడు హెర్బాను అరెస్ట్ చేసిన ఇటలీ పోలీసులు అతని నుంచి ఈ వివరాలన్ని రాబట్టారు. ఈ వ్యవహారంతో అశ్లీల సైట్ల కోసం అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+